గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

చిరకాలంగా నిర్మాణంలో వున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా మేకింగ్ నే ఓ సినిమా కథ లా మారింది.

చిరకాలంగా నిర్మాణంలో వున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా మేకింగ్ నే ఓ సినిమా కథ లా మారింది. నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ తో ఇండియన్ 2 సినిమా ప్లాన్ చేసారు ముందుగా. ఓపెనింగ్ లాంటి హడావుడి జరిగింది. కానీ కొన్ని అడ్డంకులు వచ్చి ఆ ప్రాజెక్ట్ వదులుకున్నారు. చాలా మంది మంచి పని చేసారు. దిల్ రాజు సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. శంకర్ తో సినిమా అంటే ఆషామాషీగా వుండదు. అందుకే అలా అనుకున్నారంతా. కానీ విధి బలీయమైనది అన్నట్లుగా, దిల్ రాజు – శంకర్ కాంబినేషన్ లో సినిమా రాసి పెట్టి వుంది. అందుకే మరో ప్రాజెక్టును స్టార్ట్ చేసారు. అదే గేమ్ ఛేంజర్.

స్టార్ట్ అయినపుడు ఈ ప్రాజెక్ట్ చాలా లాభదాయకమైన ప్రాజెక్ట్. కనీసంలో కనీసం 50 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వుంటుందని అంచనా వేసిన ప్రాజెక్ట్. కానీ బటర్ ఫ్లయ్ ఎఫెక్ట్ మాదిరిగా ఎక్కడో ఏదో జరిగి ఏదో అయింది అన్నట్లు మారింది. కమల్ హాసన్ విక్రమ్ 2 సినిమా అనుకోకుండా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఇండియన్ 2 ప్రాజెక్ట్ కు రెక్కలు వచ్చాయి. క్రేజీగా మారింది. పైగా దాంట్లోకి రెడ్ జాయింట్ సంస్థ వచ్చి జాయిన్ అయింది. రెడ్ జాయింట్ సంస్థ సాక్షాత్తూ ఉదయానిధి స్టాలిన్ ది. ఇక ఏ అడ్డంకులు లేవు.

ముందుగా ఇండియన్ 2 ను పూర్తి చేసి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గేమ్ చేంజర్ కు కీలక భాగస్వామిగా జీ సంస్థతో ఒప్పందంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా సినిమా బడ్జెట్ లెక్కలు, ఫైనాన్స్ లెక్కలు అన్నీ మారిపోయాయి. ఇది సినిమా ఆర్థిక అంచనాల మీద గట్టి ప్రభావం చూపించి వుంటుందన్నది ఇండస్ట్రీ మాట. పైగా ఇండియన్ 2 ను ముందుకు జరపడం వల్ల గేమ్ ఛేంజర్ వెనక్కు వుంచడం వల్ల పెట్టుబడి మీద వడ్డీల భారం అపరిమితంగా పెరిగి వుంటుందన్నది కాదనలేని విషయం.

ఈ లోగా మరిన్ని ట్విస్ట్ లు. జరగండి పాట లీక్. ఇండియన్ 2 డిజాస్టర్. శంకర్ కొన్నాళ్ల పాటు నిరాశలో వుండిపోవడం. ఇలా గేమ్ ఛేంజర్ కు వరుస సెట్ బ్యాక్ లు. ఇవన్నీ అధిగమించి ముందుకు వెళ్లింది అంటే నిర్మాత దిల్ రాజు పట్టుదల తప్ప మరేమీ కాదు. మరే నిర్మాత అయినా మధ్యలోనే ఇంత భారీ ప్రాజెక్ట్ విషయంలో చేతులు ఎత్తేసి వుండేవారు. కానీ అటో ఇటో తేల్చుకోవాల్సిందే అని పట్టుదలగా ముందుకు వెళ్లారు. పైగా నిర్మాత దిల్ రాజుకు ఇక్కడ మరో సమస్య వుంది. దర్శకుడు శంకర్ వర్కింగ్ స్టయిల్. అసలు ఏం తీస్తున్నారో, ఏం తీసారో, ఎలా వచ్చిందో అన్నది ఆయనకు, ఆయన టీమ్ కు తప్ప మరెవరికీ క్లారిటీ వుండదు. ఇవ్వరు.

నిర్మాత దిల్ రాజుకు ఈ తరహా పరిస్థితి కొత్త. ప్రతి ఇంచ్ లోనూ దగ్గర వుండి చూసుకోవడం అలవాటు. కానీ శంకర్ దగ్గర అస్సలు ఆ అవకాశమే లేదు. అయినా సహించారు భరించారు. వడ్డీలు కట్టుకున్నారు. భారం మోసారు. సినిమాను విడుదల దగ్గరకు తీసుకువచ్చారు.

మరో రెండు రోజుల్లో సినిమా విడుదల. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ప్యాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా లెక్కలతో పోల్చుకుంటే కాస్త లో ప్రొఫైల్ లో వస్తున్న సినిమా. ముఖ్యంగా మిగిలిన పాన్ ఇండియా సినిమాల మాదిరిగా గేమ్ ఛేంజర్ ను నార్త్ బెల్ట్ లో విస్తృతంగా ప్రచారం చేయలేదు. వివిధ రాష్ట్రాలు తిరగలేదు. జస్ట్ ఓ చిన్న ఈవెంట్, ఓ మీడియా మీట్ మాత్రమే చేసారు. నార్త్ బెల్ట్ లో ఊర మాస్, నాటు సినిమాలు మాత్రమే ఊపు అందుకుంటున్నాయి. ఆ లెక్కలో గేమ్ ఛేంజర్ యూత్ ఫుల్ మాస్ ప్లస్ క్లాస్ టచ్ సినిమా కేటగిరి కిందకు వస్తుంది.

బహుశా అందుకే కావచ్చు సౌత్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తెలుగునాట మెగా ఫ్యాన్స్ ఫీవర్ ఎలాగూ వుంటుంది. తమిళ్ లో శంకర్ అంటే ఇప్పటికీ ఇంకా అభిమానం వుంది. సినిమా బాగుంటే కన్నడ, మలయాళ భాషలకు పట్టే అవకాశం వుంది.

మొత్తం మీద గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాణం అన్నది క్లయిమాక్స్ వరకు వచ్చింది. సినిమా కథ సుఖాంతం అవుతుందనే ఆశిద్దాం.

21 Replies to “గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

  2. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఈ 4 ఫ్యామిలీ లను కోటీశ్వరులను చేయడానికి పుట్టినట్టు ఉంది…. తు తు ఏం బతుకులు రా మీవి… మీకు best entertainment కావాలంటే పల్లెటూళ్లో రచ్చబండ దగ్గర కూర్చుంటే ఇంతకంటే బాగుంటుంది

  3. శంకర్ షెడ్డు కి వెళ్లి చాలా కాలం అయింది. ఆయన కి సుజాత అని స్క్రిప్ట్ రైటర్ ఉండేవాడు. ఆయన చనిపోయాక శంకర్ సినిమాలన్ని స్క్రీన్‌ప్లే లో పట్టు తప్పింది. కేవలం సాంగ్స్ తప్ప నేరేషన్ మీద గ్రిప్ పోయింది.

  4. I just watched a movie in the US, and it was very bad. There’s nothing much to say. I would give it 1 star. I’m not a fan of anyone and this is a genuine review. The story is outdated and there’s no way to connect with it. The love plot between the hero and heroine is boring and the political storyline is equally dull. Thaman’s music is very bad and overly loud. He needs to change his style of music or he will fade away soon.

    Director Shankar seems to have lost his spark and is unable to create good movies anymore. It’s time for him to take a break, learn new things and come up with fresh stories for the new generation of audiences. He also needs to stop relying on graphics done in the songs, as they are not convincing and fail to impress.

Comments are closed.