విష్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఇది. ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ సినిమాకు గాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ టైటిల్ ను రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా కు సంబంధించిన షూట్ ఇటీవల చాలా రోజుల పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది.
ఇప్పటి వరకు నలభై శాతం వరకు వర్క్ పూర్తయిన ఈ సినిమా రఫ్ అండ్ సీరియస్ పొలిటికల్ టచ్ తో సాగుతుంది. విష్వక్ సేన్ ఇలాంటి సబ్జెక్ట్ చేయడం, పైగా పీరియాడిక్ సినిమా చేయడం ఇదే తొలిసారి.
సితార సంస్థ ఈ సినిమాను కృష్ణ చైతన్య కథ, మాటలు, దర్శకత్వంతో తెరకెక్కిస్తోంది. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తన్న ఈ సినిమాలో అంజలిది ఓ కీలకపాత్ర. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. దాస్ కా దమ్కీ తరువాత విష్వక్ చేస్తున్న మూడు సినిమాల్లో ఇది ఒకటి. మరో సినిమాను రామ్ తాళ్లూరికి, ఇంకో సినిమాను సాహు గారపాటి నిర్మాణంలో చేయాల్సి వుంది.
గాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న టైటిల్ కొత్తగా, క్యాచీగా వుంది. గోదావరి నేపథ్యంలో అన్నీ సాఫ్ట్ టైటిల్స్ తప్ప, ఇలా క్రేజీ టైటిల్ ఇంత వరకు లేదు. ఆ విధంగా ఈ సినిమాకు టైటిల్ అడ్వాంటేజ్ గా వుండే అవకాశం వుంది.