చూస్తుంటే గుంటూరు కారం మ్యూజిక్ డైరక్టర్ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా సంగీత దర్శకుడు థమన్ ను మారుస్తారు అన్న వార్తలు బలంగా వినిపించాయి. ఖుషీ సినిమా సంగీత దర్శకుడు అబ్దుల్ వాహిబ్ ను తీసుకుంటున్నారు అన్న వార్తలు కూడా వచ్చేసాయి. కాదు..కాదు, యువ సంగీత దర్శకుడు భీమ్స్ చేత శాంపిల్ గా ఓ పాట చేయించారు. అది సూపర్ స్టార్ బర్త్ డే కు వదిలే అవకాశం వుంది అని కూడా వార్తలు వినిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో ధమన్ నే కొనసాగుతారు అని తెలుస్తోంది. ఈ రోజు నుంచి త్రివిక్రమ్ గుంటూరు కారం పాటల పని మీదకు వచ్చారని, మార్నింగ్ 7 నుంచి 10 వరకు పాటల పని మీద డిస్కషన్లు సాగించే పని ప్రారంభించారని తెలుస్తోంది. సినిమాలో అయిదు మెయిన్ సాంగ్స్, రెండు మూడు బిట్ సాంగ్స్ వుంటాయట. ఈ పాటలు అన్నీ ఒక్కో నెలలో ఒక్కటి వంతున జనవరి విడుదల తేదీ లోగా వదులుతారు.
ఇదిలా వుంటే పాటలు రెడీ కాక, పాట షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు. ఆగస్టు 2 లేదా 3 నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలని అనుకున్నారు. దీనికి హీరో మహేష్ బాబు అవసరం లేదు. అయితే ఇప్పుడు మనసు మార్చుకుని, పాట చిత్రీకరణ కే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
హీరో మహేష్ ప్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఆయన రాగానే పాట చిత్రీకరణ వుంటుంది.