ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయింది అని అధికారికంగా వెల్లడించారు. హమ్మయ్య ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఆ సినిమా నుంచి బయటకు వచ్చి గెటప్ లు మార్చుకుంటారు అని ఫ్యాన్స్ అనుకోవడానికి వీల్లేదు.
ఇంకా తను చెప్పే వరకు గెడ్డాలు తీయవద్దని దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలకు క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. టోటల్ అవుట్ పుట్ ను తాను చూసి, ఓకె అనుకునే వరకు గెడ్డాలతోనే ఉండాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది.
బాహుబలి సినిమా టైమ్ లో కూడా షూటింగ్ అయిపోయింది అన్న తరువాత కూడా మళ్లీ కొన్ని రోజులు షూట్ చేసిన ఉదంతం వుంది. అందువల్ల ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా అందులోనూ విజువల్ ఎఫెక్ట్స్, సిజి లకు ప్రాధాన్యం వున్న సినిమా కాబట్టి అవుట్ పుట్ పూర్తిగా సెట్ కాకుండా షూట్ అయిపోయింది అని అనుకోవడానికి లేదు.
బహుశా ఇవన్నీ దృష్టిలో వుంచుకునే కావచ్చు రాజమౌళి ఇద్దరు హీరోలను ఇంకా ఆర్ఆర్ఆర్ గెటప్ ల్లోనే వుండాలని కోరింది. ఆర్ఆర్ఆర్ సినిమా 2022 జనవరి 8 కి విడుదల అని కొంత మంది, కాదు ఉగాదికే అని మరి కొంత మంది ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నారు.