మా సభ్యుల్లో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వారి శాతం తక్కువే అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారే చెబుతూ ఉన్నారు. 900 మంది సభ్యులుంటే.. వారిలో గరిష్టంగా ఐదు వందల మంది ఓటు హక్కును వినియోగించుకుంటే ఎక్కువ! అని ఎన్నికల పోటీలో నిలిచిన వారే స్ఫష్టంగా చెబుతున్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో ఐదు వందల ఓట్లు పోల్ అవుతాయని నరేష్ అంచనా వేసి చెప్పారు!
సభ్యత్వం కలిగిన వారిలోనే సగం మందికి అనాసక్తి ఈ ఎన్నికలు అని ఇలా స్పష్టత వస్తోంది. అయితే కొందరు మాత్రం సుదూరం నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినియోగించుకుంటున్నారు. వారిలో ఒకరు నటి జెనిలీయా.
తెలుగునాట ఒక దశలో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలిగిన జెనీలియా.. రితీష్ దేశ్ ముఖ్ తో వివాహం తర్వాత టాలీవుడ్ కు అన్ని రకాలుగానూ దూరం అయ్యింది. రితీష్ దేశ్ ముఖ్ బాలీవుడ్ లో నటుడిగా కూడా నేపథ్యం కలిగి ఉండటంతో.. బాలీవుడ్ వాలా అయ్యింది జెనీలియా. ఏతావాతా ముంబైలో పక్కగా సెటిలైంది.
ఈ రోజు మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో జెనీలియా మెరిసింది. తనదైన రీతిలో చలాకీగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అగుపించింది. ఇలా తను తెలుగు సినీ మూలాలను ఇంకా మరవలేదని జెనీలియా డిసౌజా క్లారిటీ ఇచ్చింది.
ఇక జెనీలియా ఎవరికి ఓటేసిందనేది కూడా ఆసక్తిదాయకమైన విషయమే. ఈ విషయాన్ని ఆమె చెప్పలేదు. అంతే కాదు.. ఇరు ప్యానళ్లతోనూ జెనిలీయా చాలా సఖ్యతగా కనిపించింది. ప్రకాష్ రాజ్ ను ఆలింగనం చేసుకుని పలకరించింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో సరదాగా మాట్లాడింది.
అలాగే విష్ణుతోనూ పలకరింపు హగ్ కామన్. అటు ప్రకాష్ రాజ్ తోనూ జెనీలియాకు కలిసి నటించిన అనుభవం ఉంది. వారిది హిట్ కాంబో! ఇక విష్ణూకూ కెరీర్ లో చెప్పుకోదగిన హిట్ అయిన ఢీలో హీరోయిన్ జెనీలియానే. మరి వీరిలో ఎవరికి జెనీలియా ఓటేసిందో!g