హీరో నాగార్జున బాలీవుడ్ కు పరిచయమే. అడపా దడపా బాలీవుడ్ సినిమాల్లో చేస్తూనే వున్నాడు. ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అదే నేపథ్యంలో తన ఘోస్ట్ సినిమాను బాలీవుడ్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు.
కేవలం నాగ్ పట్టుదల, కోరిక వల్లే ఘోస్ట్ సినిమా హిందీలో కూడా విడుదలవుతోంది. వాస్తవానికి ఘోస్ట్ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు ఎప్పడో విక్రయించేసారు. ఇప్పుడు హిందీ బెల్డ్ లో హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదల చేయాలంటే నిర్మాతకు వీలు కాదు.
హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు కొనుక్కున్న బయ్యర్ కు మాత్రమే సాధ్యం. అందుకే ఆ బయ్యర్ ను హైదరాబాద్ కు రప్పించి ఘోస్ట్ సినిమా చూపించినట్లు తెలుస్తోంది. అలా చూపించి, బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ను విడుదల చేయడానికి ఒప్పించినట్లు భోగట్టా.
హిందీలో ఏమాత్రం హిట్ అయినా, డబ్బులు వచ్చినా అదంతా ఆ బయ్యర్ కే లాభం. మరి అలా కాకుండా ఖర్చులు కూడా రాకపోతే ఏం చేస్తారు అన్నదాని మీద నాగ్..ఆ బయ్యర్ ఏదో ఒక అగ్రిమెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఘోస్ట్ సినిమా విశాఖ ఏరియాలో కూడా నాగ్ తనే తీసుకుని విడుదల చేసుకుంటున్నారు.