సీనియర్ హీరో నాగ్ లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూళ్లు చేసిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను నాగ్ బర్త్ డే సందర్భంగా బయటకు వదిలారు.
'ది ఘోస్ట్' అని టైటిల్ ఫిక్స్ చేసారు. టైటిల్ కు తగినట్లే వుంది లుక్ కూడా. రక్తం ఓడుతున్న కత్తి పట్టుకుని నాగ్ స్టయిలిష్ గా నిలబడగా, విదేశీ జనాలు అంతా అతని ముందు మోకరిల్లి కనిపించారు.
నాగ్ ను మాఫియా డాన్ గానో, లేక లీడర్ గానో అనుకోవాలేమో? పక్కా హాలీవుడ్ స్టైల్ కు టాలీవుడ్ మాస్ ను మిక్స్ చేసినట్లు వుంది పోస్టర్. గ్రే షేడ్ తో చేసిన డిజైన్ బాగుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించే ఈ సినిమాకు ఆసియన్ సునీల్, పుష్కర రామ్మోహనరావు నిర్మాతలు.
ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూట్ లో, అలాగే బిగ్ బాస్ వ్యవహారాల్లో బిజీగా వున్న నాగ్, ఆ రెండింటి తరువాత ది ఘోస్ట్ ఫినిష్ చేస్తాడు.