Advertisement

Advertisement


Home > Movies - Movie News

గాడ్ ఫాదర్ మార్కెట్ 150 కోట్లకు పైగానే

గాడ్ ఫాదర్ మార్కెట్ 150 కోట్లకు పైగానే

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సోషల్ మీడియాకు రెగ్యులర్ మీడియాకు ట్రోలింగ్ కు, వార్తలకు ముడిసరుకుగా మారిపోతోంది. సినిమా విడుదల పట్టుమని పక్షం రోజులు లేదు అయినా పబ్లిసిటీ కనిపించకపోవడమే దీనికి కారణం. 

మెగాస్టార్ సినిమా కావడం, నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ లో, మార్కెటింగ్ లో బిజీగా వుండడం, ఇంకా చాలా కారణాల వల్ల ప్రచారం ప్రారంభించలేదు. తొలిపాట వదులదాము అనుకుంటే కంటెంట్ కు సల్మన్ ఖాన్ టీమ్ నుంచి అప్రూవల్ రాలేదు. దాంతో వాళ్లు చెప్పిన కరెక్షన్లు చేసి, అప్రూవల్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాటను వదలాల్సి వుంది. దీని తరువాత రెండు పాటలు కూడా వెంటవెంటనే విడుదల చేసేస్తారు.

ఇదిలా వుంటే 25న ట్రయిలర్ వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురంలో సభకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీనికి సల్మాన్ వచ్చేదీ లేనిదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా మార్కెటింగ్ పనులు మాత్రం ఫినిష్ చేసేసారు. ఓవర్ సీస్ హక్కులు ఫారస్ ఫిలింస్ కు, తెలుగు, హిందీ ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్, హిందీ విడుదల బాద్యతలు, శాటిలైట్ హక్కులు అక్కడి ఓ డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చేసారు.

ఇక మిగిలింది తెలుగు శాటిలైట్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను నిర్మాతే నేరుగా పంపిణీ చేసుకుంటున్నారు. మొత్తం సినిమా టర్నోవర్ 150 కోట్లకు పైగానే వుంటుందని అంచనా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?