ఆ హీరో మళ్లీ విలన్ గా మారుతున్నాడా?

గోపీచంద్ విలన్ గా నటిస్తాడనే స్టోరీల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడి ఫోకస్ మొత్తం రాబోయే చిత్రాలపైనే ఉందని తెలిపింది.

విలన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన నటులు చాలామంది ఉన్నారు. అదే విధంగా హీరోగా చేసి, విలన్ పాత్రలకు మారిన నటులు కూడా ఉన్నారు. ఇదే కోవలో హీరో గోపీచంద్, మరోసారి నెగెటివ్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నాడనే ప్రచారం మొదలైంది.

హీరో సూర్య నటించే తదుపరి సినిమాలో గోపీచంద్‌ను విలన్ గా తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. ఈ నెగెటివ్ రోల్ చేయడానికి అతడు భారీగా పారితోషికం అందుకున్నారంటూ కథనాలు కూడా వస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రచారాన్ని గోపీచంద్ టీమ్ తిప్పికొట్టింది. గోపీచంద్ విలన్ గా నటిస్తాడనే స్టోరీల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడి ఫోకస్ మొత్తం రాబోయే చిత్రాలపైనే ఉందని తెలిపింది.

హీరోగా సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ, ఆ వెంటనే విలన్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు గోపీచంద్. జయం, వర్షం, నిజం లాంటి సినిమాల్లో అతడి విలనిజం ఇప్పటికీ చాలామందికి గుర్తు. అయితే ఆ తర్వాత హీరోగా మారి క్లిక్ అయ్యాడు గోపీచంద్.

అప్పట్నుంచి మళ్లీ నెగెటివ్ షేడ్స్ వైపు రాలేదు. అయితే బలమైన పాత్ర దొరికితే ప్రభాస్ సినిమాసలో విలన్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఓసారి ప్రకటించాడు గోపీచంద్. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్‌లో మాత్రం ఎలాంటి నిజం లేదని అతడి టీమ్‌ స్పష్టం చేసింది.