ఎక్స్ క్లూజివ్- బన్నీ-త్రివిక్రమ్ పనులు మొదలు

ఈ సినిమాను సంక్రాంతి తరువాత మంచి రోజు చూసి అనౌన్స్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఈ సినిమా పనుల మీద డిస్కషన్లు మొదలయ్యాయి.

పుష్ప 2 తరువాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్ దే. అందులో సందేహం లేదు. రామాయణంతో లింక్ వుంటుంది. హిస్టారికల్ టచ్ వుంటుంది. ఏదో సమ్ థింగ్ స్పెషల్ సబ్జెక్ట్. అంత వరకు బయటకు వచ్చింది. మొత్తానికి పాన్ ఇండియా భారీ సినిమా అన్నది ఫిక్స్. ఈ సినిమాను సంక్రాంతి తరువాత మంచి రోజు చూసి అనౌన్స్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఈ సినిమా పనుల మీద డిస్కషన్లు మొదలయ్యాయి.

కీలక టెక్నీషియన్లు ఎవరైతే బాగుంటుంది అనే డిస్కషన్లు సాగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్, ఆర్ట్ డైరక్టర్, విఎఫ్ఎక్స్ చీఫ్ టెక్నీషియన్ ఇవి కీలకం. త్రివిక్రమ్ సినిమాలకు పనిచేసే సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదకు వెళ్లారు. అందువల్ల వేరే ఆప్షన్స్ చూస్తున్నారు.

అలాగే మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ కు బదులు అనిరుధ్ ను తీసుకోవాలనే డిస్కషన్ నడుస్తోంది. ఆర్ట్ డైరక్టర్ ఎప్పడూ ప్రకాష్ వుంటారు. పాన్ ఇండియా లెవెల్ టెక్నీషియన్ ను తీసుకోవాలనే ఆలోచన వుంది. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కీలకం కనుక ఎవరైనా పెర్ ఫెక్ట్ అనే చర్చ కూడా సాగుతోంది.

వన్స్ త్రివిక్రమ్ లెవెల్ లో ఒకటి రెండు ఆప్షన్స్ ఫైనల్ అయితే బన్నీతో సిట్టింగ్ వేసి ఫైనల్ చేస్తారు. ఈ చీఫ్ టెక్నీషియన్లు ఫిక్స్ అయితే వారితో కూర్చుని స్టోరీ బోర్డ్, మేకింగ్ తదితర విషయాల మీద ఇక వరుస సమావేశాలు వుంటాయి. సినిమా ఏప్రియల్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. అప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనుల డిస్కషన్ తోనే సరిపోతుంది.

2 Replies to “ఎక్స్ క్లూజివ్- బన్నీ-త్రివిక్రమ్ పనులు మొదలు”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి వర్క్

Comments are closed.