దేశరాజధాని ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట! కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్న 1998-2004ల మధ్య కూడా ఢిల్లీ కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. వరసగా మూడు పర్యాయాల పాటు విజయాలు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ఒకటీ రెండు సీట్లలో కూడా ఉనికిలో లేని పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ ను చిత్తు చేసింది బీజేపీ అనడం కన్నా, ఆప్ అనడమే కరెక్ట్. మళ్లీ కోలుకోలేని రీతిలో ఆప్ అక్కడ కాంగ్రెస్ ను చిత్తు చేసింది.
కేవలం ఢిల్లీనే కాకుండా, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు ఆప్ ఎప్పటికప్పుడు షాక్ లు ఇస్తూనే ఉంది. బీజేపీకి ఆప్ కూడా వ్యతిరేకమే. ఆ విషయంలో కాంగ్రెస్ కు మిత్రపక్షమే. అయితే ఢిల్లీ వరకూ కాంగ్రెస్ ఆధిపత్యానికి ఆప్ వేసిన బ్రేక్ అలాంటిలాంటిది కాదు.
ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే.. కాంగ్రెస్ కు తన కూటమిలోని పార్టీలన్నీ ఝలక్ ఇచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో తమ మద్దతు ఆప్ కేనంటూ ఆ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకూ సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు ఢిల్లీలో తమ మద్దతు ఆప్ కేనంటూ ప్రకటించాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ఇలా ఒంటరైంది. ఇక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ ఉండలేదు. ఆప్ తో సీట్ల బేరానికి వెళితే అంతకన్నా అవమానం లేదు. గట్టిగా పోరాడటానికి ముందులా శక్తి లేదు. బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పడితే వ్యర్థం అనే లెక్కతో ఆప్ కే మొగ్గు చూపే పరిస్థితే ఉంది. కాంగ్రెస్ ఎంతో కొంత శక్తి చూపి ఓట్లను చీల్చినా అది అంతిమంగా బీజేపీకి సానుకూలంగా మారనూ వచ్చు! మొత్తానికి దేశ రాజధానిలో కాంగ్రెస్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!
తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి పని
దీని భావం ఏమి రుద్రేశా ?
కాల్ చేస్తే తెలుస్తుంది బసవన్న
అయ్యా వెరీ గ్యాస్ ఆంధ్ర ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయో అప్పుడే కాంగ్రెసు కనుమరుగయ్యింది. ఇప్పుడు కొత్తగా ఒంటరి అయినది ఏమీ లేదు . కాంగ్రెస్ వారు అనుసరించిన విధానాలతో కాంగ్రెస్ స్థానాలని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేసుకున్నాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి బంధం ఎన్నాళ్ళు ఉంటుంది. ముందు నుంచి ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ఒప్పుకోలేదు . ఎన్నో మాటలు చెప్పే మమత అసలు కాంగ్రెస్తో పని చేయడానికి ఒప్పుకోలేదు. ఇష్టం లేకపోయినా అఖిలేష్ యాదవ్ మొహం మాటకు కాంగ్రెస్తో పని చేయడానికి ఒప్పుకున్నాడు గాని అది ఎన్నాళ్లో నిలుపుకోలేకపోయాడు. మధ్యప్రదేశ్లో కూటమి ఒప్పందాన్ని ఉల్లంఘించి తన అభ్యర్థులను నిలిపాడు. నేటి సిక్కు కలుస్తాను ఉద్యమం ఉద్యమానికి కారకులు ఎవరు. కాంగ్రెస్ వారు కాదా?
పంజాగులు ఆ కాళీ ప్రకాష్ సింగ్ బాధలు ప్రభుత్వాన్ని పొడవటానికి ఎప్పుడైతే బింద్రేనువాలను చేర దిశారో అప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. చాన్నాళ్ళ గాని తిరిగి కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.
కెప్టెన్ అమరేందర్ సింగ్ నాయొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
తిరిగి వారు అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో బంగారు పళ్లెంలో పెట్టి ఆప్ కు అప్పగించేశారు అధికారం. కూటమిగా ఏర్పడి అందరూ మొక్కు తీర్చుకున్నారే కానీ మనస్ఫూర్తిగా ఎవరు దాని బలోపేతానికి పనిచేయలేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టింది మాత్రం ఆపే.
ఇక ఒరిస్సాలో గిరిధర్ గోమాంగో ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ మనుగడ సాగించలేకపోయింది. ఇక తమిళనాడులో అధికారం పోయి దాదాపుగా 40 ఏళ్ళు అయింది. ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని ఏపీలో గత 15 ఏళ్లగా నామరూపాలు లేకుండా పోయింది. ఇక కేరళలో వినరా విజయం చావు దెబ్బ కొట్టాడు కాంగ్రెస్ నో . ఇక మహారాష్ట్రలో అధికారానికి దూరమై దాదాపుగా 15 ఏళ్లు అయిపోయింది. ఇక గుజరాత్ లో దాదాపుగా 25 ఏళ్ల నుంచి దాదాపుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగానే ఉంది . రాజస్థాన్ కూడా అంతే అదే దారిలో ఉంది. ఒక మధ్యప్రదేశ్ కూడా దాదాపుగా 15 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగానే ఉంది. బీహార్ సేమ్ టు సేమ్. అస్సాము అదే దారే . ఇక సెవెన్ సిస్టర్ ఈశాన్య రాష్ట్రాలలోఅసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది అక్కడ. ఇక కాశ్మీర్ కూడా అంతే దాదాపుగా 20 ఏళ్ల నుంచి అక్కడ అధికారంలో లేదు. ఇక కర్ణాటక తెలంగాణలో అయితే అక్కడున్న ప్రభుత్వాలు మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ వచ్చింది కానీ నిజంగానే కాంగ్రెస్ మీద అభిమానంతో అయితే కాదు. ఒక చిన్న రాష్ట్రమైన గోవా కూడా ఎప్పుడో చేజారి పోయింది. ఇక చత్తీస్గడ్ జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అదే ధారే. చచ్చి చెడి హిమాచల్ ప్రదేశ్లో అధికారానికి వస్తే సంక్షోభం
ఒక్కటి మాత్రం స్పష్టం ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేదు. ఏదో బిజెపి మీరే కోపంతో అందరూ ఏకమయ్యారు కానీ
అందరూ మనస్ఫూర్తిగా ఏకమైతే కాలేదు . తాత్కాలిక ఒప్పందం మీద ఏకమయ్యారు. అటువంటిది ఎన్నో రోజులు సాగదని అందరూ రుజువు చేశారు. ఒక్కసారి సొంతంగా నీళ్లు తాగడానికి రుచి మరిగిన వారు తిరిగి మోచేతి కింద నీళ్లు తాగడానికి ఎవరూ ఒప్పుకోరు
ఇది సత్యం .