90లలో వచ్చిన మలయాళీ సినిమా మణిచిత్రతాళు ఇంకా అనేక సినిమాలకు ఊపిరి పోస్తూనే ఉంది! అది అప్పట్లోనే తెలుగులోకి అనువాదం అయ్యింది, ఎందుకో విడుదల కాలేదు! ఆ తర్వాత కన్నడీగులకు ఆ సినిమా అవకాశం ఇచ్చింది. ఆప్తమిత్రగా ఆ సినిమా రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. దాన్ని చూసి రజనీకాంత్ ఆ సినిమాను చంద్రముఖి పేరుతో రీమేక్ చేయడంతో ఆ సినిమా ప్రభంజనంగా మారింది.
ఇరవై యేళ్లు అయ్యాయి చంద్రముఖి విడుదల అయ్యి. అప్పట్లోనే ఆ సినిమా 40 కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లు సాధించినట్టుగా వార్తలు వచ్చేవి! అప్పటికి బాల్కానీ టికెట్ ధర కూడా 20 రూపాయలే! ఆ లెక్కల్లోనే 40 కోట్ల రూపాయలట!
ఆ తర్వాత కన్నడలో దానికి సీక్వెల్ వచ్చింది. అదేమంత గొప్ప సీక్వెల్ కాకపోయినా.. విష్ణువర్ధన్ ఆఖరి సినిమా కావడంతో అది కూడా సంచలన విజయం సాధించింది. ఆ సినిమా చేసిన వెంటనే విష్ణువర్ధన్ మరణించడంతో దానికి యాంటీ సెంటిమెంట్ తోడయ్యింది. ఆ సినిమాను రజనీ రీమేక్ చేసే ఆలోచన ఉన్నా.. ఎందుకో విరమించుకున్నారు! కానీ దాని దర్శకుడు పి. వాసు దాన్ని నాగవల్లి పేరుతో వెంకటేష్ తో తెలుగులో రీమేక్ చేసినా.. అదో డిజాస్టర్ గా నిలిచింది.
కొంతకాలం పాటు అలా చంద్రముఖికి తెరపడినా, అప్పటికే హిందీలో దాన్ని భూల్ భులయ్యా గా రీమేక్ చేసిన హిందీ వాళ్లు దాని క్యాష్ చేసుకునే ప్రయత్నాలను కొనసాగించారు. మలయాళీ ఒరిజినల్ మణిచిత్రతాళ్ లో కొంత పార్ట్ ను డైరెక్ట్ చేసిన ప్రియదర్శనే హిందీలో ఆ సినిమాను రీమేక్ చేశాడు. ఓ మోస్తరుగా హిట్ అయ్యింది. అయితే హారర్ కామెడీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా హిందీలో భూల్ భులయ్యా 2 వచ్చింది, అది రెండు వందల యాభై కోట్ల కు పైగా వసూళ్లు సాధించిందట! అలా తొలి పార్ట్ తో పోలిస్తే మంచి హిట్ గా నిలిచింది హిందీలో!
దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవడానికి భూల్ భులయ్యా 3 అంటూ మరోటి వదిలారు. కటెంట్ పరంగా ఈ సినిమా నెగిటివ్ రివ్యూలు పొందినా, నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించిందట! ఇంకేముంది.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయాలో అంతుబట్టని పరిస్థితుల్లో ఉన్నారు బాలీవుడ్ హీరోలు. వీరిలో అక్షయ్ కుమార్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది.
భూత్ బంగ్లా అంటే ఇంకోటి వదులుతున్నారట. అక్షయ్ కు అచ్చొచ్చిన ప్రియదర్శనే ఈ సినిమా డైరెక్టర్. భూల్ భులయ్యా సినిమాను షూట్ చేసిన బంగ్లాలోనే ఈ సినిమానంత తీస్తున్నారట! ఈ కనెక్షన్ సంగతెలా ఉన్నా.. బాలీవుడ్ దిక్కుతోచని స్థితికి ఇది తార్కాణం. చంద్రముఖి తర్వాత హారర్ కామెడీ జోనర్ లో లెక్కలేనన్ని సినిమాలు చూసిన సౌత్ జనాలు మాత్రం.. ఆ తరహా సినిమాలను నిస్సంకోచంగా తిరస్కరిస్తున్నారు. ఆ మధ్య చంద్రముఖి 2 అంటూ లారెన్స్, పీ వాసు కలిసి వస్తేనే దానికి పోస్టర్ ఖర్చులు కూడా దక్కలేదు.
It was released in Telugu as “Aatma raagam”. I watched this movie in Tirupathi Balaji theatre on 50th day of the movie. Wanted to watch again but it was last day.
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి పని
చంద్రముఖి 2 సినిమా కాదు కదా ట్రైలర్ కూడా చాలా మంది చూసి ఉండరు