గిల్డ్ కీలక సమావేశం నేడు

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు సినిమా నిర్మాణాలను నిలిపివేయడానికి ఏ మేరకు అవకాశం వుంటుంది అనే కీలక అంశం మీద ఆదివారం చర్చ జరగబోతోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ యాక్టివ్ గిల్డ్ ప్రస్తుతం నిర్మాణంలో వున్న…

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు సినిమా నిర్మాణాలను నిలిపివేయడానికి ఏ మేరకు అవకాశం వుంటుంది అనే కీలక అంశం మీద ఆదివారం చర్చ జరగబోతోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ యాక్టివ్ గిల్డ్ ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల నిర్మాతలు అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించింది. 

గిల్ట్ సభ్యులంతా శనివారం సమావేశమై ఈ మేరకు చర్చించిన సంగతి తెలిసిందే. రెండుమూడు నెలల పాటు నిర్మాణాలు ఆపితే బెటర్ అనే ఆలోచన గిల్డ్ ముందుకు వచ్చింది.  

ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లు, పెరిగిపోతున్న నటుల పారితోషికాలు, తగ్గిపోతున్న థియేటర్ల రాబటి ఈ సమావేశంలో చర్చకు వచ్చినపుడు, అసలు సినిమాల నిర్మాణమే రెండు మూడు నెలలు ఆపేస్తే బెటర్ అనే ప్రతిపాదన వచ్చింది. 

ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని సినిమాలు ఆపేయాలని అనుకున్నారు. కానీ అలా అనడం సరికాదని, ఆపితే అందరూ ఆపేయాలని అప్పుడే అందరికీ పెయిన్ తెలుస్తుందని గిల్డ్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దాంతో ఆదివారం మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తారు. సినిమాల నిర్మాణం ఆపడం సాధ్యాసాధ్యాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఒకవేళ అందరూ ఒకే మాట మీదకు వస్తే సినిమాల నిర్మాణం బంద్ చేస్తారు.