గిల్డ్ లో డిస్కషన్ తప్పదా?

నిన్న చెప్పిన మాటలు నేడు వెంటాడం అంటే ఇదే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఒకటి రెండేళ్ల క్రితం సంక్రాంతికి మన సినిమాలు రెండు మూడు వుండగా డబ్బింగ్ సినిమా ఎలా వేస్తారు అనే…

నిన్న చెప్పిన మాటలు నేడు వెంటాడం అంటే ఇదే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఒకటి రెండేళ్ల క్రితం సంక్రాంతికి మన సినిమాలు రెండు మూడు వుండగా డబ్బింగ్ సినిమా ఎలా వేస్తారు అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదే స్టేట్ మెంట్ ఆయనకు ఎదురు కాబోతోందట. 

వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, ఏజెంట్ లాంటి స్ట్రయిట్ సినిమాలు వుండగా సంక్రాంతికి వారసుడు లాంటి డబ్బింగ్ సినిమా ఎలా వేస్తారు? వారసుడు డబ్బింగ్ సినిమా కాదు అని అనలేరు. ఎందుకంటే గిల్డ్ సమ్మె టైమ్ లో డబ్బింగ్ సినిమా అని చెప్పే ఆపకుండా షూటింగ్ చేసారు.

ప్రస్తుతానికి దిల్ రాజు నేరుగా అడగకున్నా, గిల్డ్ లో యాక్టివ్ గా వున్న నిర్మాతలు అంతా ఇవే కామెంట్లు చేస్తున్నారు. గిల్డ్ పెద్దగా దిల్ రాజునే సంక్రాంతికి డబ్బింగ్ సినిమా వేస్తే ఎలా అని కామెంట్లు చేస్తున్నారు. ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర ఈ విషయాన్ని గిల్డ్ లోనే తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి.

ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడింది కనుక తన ఏజెంట్ సినిమాను సంక్రాంతి టైమ్ లో విడుదల చేయాలని అనిల్ సుంకర అనుకుంటున్నారు. తన సినిమాకు గట్టిగా 400 థియేటర్లు వుంటే చాలనుకుంటున్నారు. వారసుడు రాకుండా వుంటే బాలయ్య, మెగాస్టార్, అఖిల్ సినిమాలకు థియేటర్లు సరిపోతాయి. కానీ వారసుడు వస్తే కష్టం.

ప్రస్తుతానికి జ‌నవరి 11, 13, 14 డేట్లలో సినిమాల విడుదలలు వుంటాయని వినిపిస్తోంది. వారసుడు వస్తే ఏజెంట్ పరిస్థితి ఏమిటి? వారసుడు వచ్చినా ఏజెంట్ సినిమా పక్కా అని అనిల్ సుంకర వర్గాల బోగట్టా. అంతకన్నా ముందుగా ఈ డబ్బింగ్ సినిమా విషయం గిల్డ్ లో గట్టిగా పట్టుకుంటామని చాలా మంది నిర్మాతలు అనిల్ సుంకరకు మద్దతుగా అంటున్నారు. 

కానీ దిల్ రాజు తో అందరికీ అవసరాలు వున్నాయి కనుక ఈ గొంతులు ఇలా తెరవెనుకేనా? లేక గిల్డ్ లో కూడా వినిపిస్తాయా? అన్నది అనుమానమే.