ఆస్కార్ రేసు నుంచి ఇండియా సినిమా ఔట్!

ఆస్కార్ విదేశీ సినిమా కేట‌గిరి పోటీ నుంచి ఇండియ‌న్ సినిమా నిష్క్ర‌మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు సంబంధించిన సినిమాల్లో ఒక‌దానికి ప్ర‌తియేటా ఆస్కార్ అవార్డును ఇస్తూ ఉంటారు. విదేశీ కేట‌గిరిలో ఏ భాష…

ఆస్కార్ విదేశీ సినిమా కేట‌గిరి పోటీ నుంచి ఇండియ‌న్ సినిమా నిష్క్ర‌మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు సంబంధించిన సినిమాల్లో ఒక‌దానికి ప్ర‌తియేటా ఆస్కార్ అవార్డును ఇస్తూ ఉంటారు. విదేశీ కేట‌గిరిలో ఏ భాష సినిమా అయినా పోటీ ప‌డ‌వ‌చ్చు. దేశీయంగా వ‌చ్చిన సినిమాల్లో బెస్ట్ అనుకున్న‌దాన్ని ఎంపిక చేసి.. ఆస్కార్ రేసుకు పంపుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది ఇండియా నుంచి 'గ‌ల్లీ బాయ్' సినిమా ఆస్కార్ నామినేష‌న్ కోసం వెళ్లింది.,

అయితే ఈ సినిమా టాప్ టెన్ లో నిల‌వ‌లేక‌పోయింది. మొత్తం తొంభై రెండు సినిమాలు టాప్ టెన్ కోసం పోటీ ప‌డ్డాయి. అయితే వాటితో ఈ సినిమా నిల‌వ‌లేక‌పోయింది. వివిధ దేశాల‌కు సంబంధించి టాప్ టెన్ సినిమాలు నిలిచాయి. ఇండియ‌న్ సినిమాకు మాత్రం మ‌రోసారి నిరాశే మిగిలింది. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఇలా ఇంటి బాట ప‌ట్టింది.

చాలా కాలంగా ఇండియా సినిమాలేవీ విదేశీ కేట‌గిరిలో క‌నీసం టాప్ టెన్లో కూడా నిల‌వేక‌పోతూ ఉన్నాయి. చివ‌ర‌గా అశుతోష్ గోవ‌రీక‌ర్ సినిమా 'ల‌గాన్' 2001లో ఫైన‌ల్ ఫైవ్ వ‌ర‌కూ వెళ్లింది. ఆ త‌ర్వాత మ‌రే సినిమా క‌నీసం ఆ స్థాయికి వెళ్లలేదు. అంత‌కు ముందు కొన్ని ద‌శాబ్దాల కింద‌ట మ‌ద‌ర్ఇండియా, స‌లాం బాంబే సినిమాలు ఆస్కార్ రేసులో టాప్ ఫైవ్ వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చాయి.