Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్.. మహేష్ బాబు ఉగాది కానుక

ఎక్స్ క్లూజివ్.. మహేష్ బాబు ఉగాది కానుక

మహేష్ బాబు నుంచి ఉగాది కానుక సిద్ధమైంది. అతడు నటించిన గంటూరుకారం సినిమా ఉగాది కానుకగా టీవీల్లో ప్రసారం కాబోతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను ఉగాది కానుకగా టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉంది ఆ సంస్థ.

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది గుంటూరుకారం సినిమా. థియేటర్లలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే త్రివిక్రమ్-మహేష్ స్థాయిలో సినిమా లేదనేది మాత్రం కఠోర వాస్తవం. ఆ తర్వాత కొన్నాళ్లకే ఓటీటీలోకి వచ్చేసింది. కొన్ని రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

ఇప్పటికీ ఈ సినిమా హడావుడి నడుస్తూనే ఉంది. సినిమాలో పెట్టని సాంగ్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. త్వరలోనే వీడియో సాంగ్స్ మరిన్ని రాబోతున్నాయి. ఈ హంగామాను మరింత పెంచుతూ, టీవీల్లోకి కూడా వస్తోంది మహేష్ మూవీ.

టీవీల్లో మహేష్ ప్రభంజనం గురించి కొత్తగా చెప్పేదేముంది. అతడు నటించిన చాలా సినిమాలు టీఆర్పీల్లో రికార్డులు బద్దలుకొట్టాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా అయితే రేటింగ్స్ లో టాప్-3లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ రికార్డులన్నింటినీ గుంటూరుకారం సవరిస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?