‘గుంటూరు కారం’ ఇల్లు కోసం అన్వేషణ

పాట తో మొదలుపెడతారా?  Advertisement ఫైట్ తో స్టార్ట్ చేస్తారా? ప్రకాష్ రాజ్ మీద సీన్లతో శ్రీకారం చుడతారా? ఇదీ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంగతి. ప్రకాష్ రాజ్ డేట్…

పాట తో మొదలుపెడతారా? 

ఫైట్ తో స్టార్ట్ చేస్తారా?

ప్రకాష్ రాజ్ మీద సీన్లతో శ్రీకారం చుడతారా?

ఇదీ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంగతి. ప్రకాష్ రాజ్ డేట్ లు అతి కష్టం మీద ఈ నెల 20 నుంచి దొరికినట్లు తెలుస్తోంది. అందువల్ల అతని ఇంటి సీన్ లు తీయాలి. సెట్ అంటే ఇప్పటికిప్పుడు రెడీ కాదు. అందువల్ల సూటయ్యే ఇంటి కోసం వెదుకుతున్నారు. పోనీ ఈ లోగా ఓ పాట చేద్దామా లేదా ఫైట్ చేద్దామా అన్న ఐడియాలు కూడా వున్నట్లు తెలుస్తోంది.

హీరో వరకు ప్రస్తుతానికి 20 నుంచి షూట్ అన్న సమాచారం వుంది తప్ప, ఏం షూట్ అన్నది లేదని తెలుస్తోంది. గతంలో వేసిన రెండు షెడ్యూళ్లు కాకుండా ఇంకా 78 రోజుల టాకీ షూట్ వుందని తెలుస్తోంది. నెలకు 20 రోజలు వర్క్ చేసినా, అక్టోబర్ ఎండ్‌కు టాకీ అయిపోతుంది. ఓ సాంగ్ బకాయి వుంటుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాను ఎలాగైనా అక్టోబర్ ఎండ్ కు ఓ కొలిక్కి తెచ్చి, రాజమౌళి సినిమా మీదకు వెళ్లాలన్నది మహేష్ బాబు ఆలోచనగా వుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని బోగట్టా.