Advertisement

Advertisement


Home > Movies - Movie News

‘గుంటూరు కారం’ మైనస్ నా? ప్లస్ నా?

‘గుంటూరు కారం’ మైనస్ నా? ప్లస్ నా?

గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్‌కు లేదా నిర్మాత చినబాబుకు, హీరో మహేష్ బాబుకు ప్లస్ నా? లేదా మైనస్ నా? అన్న సంగతి పక్కన పెడితే, హీరోయిన్ శ్రీలీలకు మాత్రం కాస్త మైనస్ నే అయింది.

నిజానికి ఆ సినిమాకు శ్రీలీల ఎంత చేయాలో అంతా చేసింది. తన కష్టం దాచుకోకుండా డ్యాన్స్ చేసింది. నిజానికి, మహేష్-శ్రీలీల.. డ్యాన్స్ నెంబర్ల వల్లే ఆ సినిమా కాస్తయినా నిలబడింది. బయ్యర్లను చాలా వరకు గట్టెక్కించింది. కానీ ఇంత చేసినా శ్రీలీలకు మాత్రం మైనస్ నే అయింది.

వరుసగా మిడ్ రేంజ్ హీరోల పక్కన సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది శ్రీలీల. అలాంటి టైమ్ లో సడెన్ గా వచ్చి పడింది గుంటూరు కారం మెయిన్ లీడ్ చాన్స్. ఆ సినిమాలో ముందు అనుకున్నది మెయిన్ లీడ్ కాదు. పూజా హెగ్డే మెయిన్ లీడ్. కానీ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది త్రివిక్రమ్ కు. దాంతో సెకెండ్ లీడ్ అనుకున్న శ్రీలీల ను మెయిన్ లీడ్ కింద మార్చారు. అంతా బాగానే వుంది కానీ సినిమా అనుకున్న రేంజ్ కు చేరలేదు. శ్రీలీల కు పెద్దగా పేరూ రాలేదు.

దాంతో ఇప్పుడు శ్రీలీల కెరీర్ కు పాజ్ బటన్ నొక్కినట్లు అయింది. అటు చూస్తే మిడ్ రేంజ్ హీరోలు చాలా మందితో నటించింది. ఇంకా నటించని వాళ్లు వుండనే వున్నారు. కానీ వరుసగా పరాజయాలు పలకరించడం, గుంటూరు కారం కలిసి రాకపోవడంతో శ్రీలీల పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియక జంక్షన్ లో నిలబడిపోయినట్లయింది. ఇప్పుడు మరీ కిందకు దిగి సినిమాలు ఒప్పుకుంటే, అదిగో శ్రీలీల కిందకు దిగిపోయింది అంటారు. అలా అని కాస్త చెప్పుకోదగ్గ హీరోల పక్కన చాన్స్ ల కోసమే చూస్తూ వుంటే సమయం మించిపోతుంది.

ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమా చేస్తోంది శ్రీలీల. పవన్ సరసన ఉస్తాద్ భగత్ సినిమా వుంది. ఇప్పటి వరకు ఇంకా నాని, శర్వానంద్, అడవి శేష్, సిద్దు జొన్నల గడ్డ లాంటి యంగ్ పాపులర్ హీరోల సరసన నటించలేదు. చేయని హీరోల జాబితా పెద్దదే వుంది. కానీ రెండు మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో మేకర్లు వేరే హీరోయిన్ల వైపు చూడడం ప్రారంభించారు. కథలో లోపం వున్నా, దర్శకత్వంలో లోపం వున్నా సినిమా ఫ్లాపు అయితే హీరోలకు సమస్య వుండదు.. దర్శకులకు ప్రోబ్లెం వుండదు. డౌన్ అయిపోయేది హీరోయిన్ నే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?