సింగిల్ లాంగ్వేజ్ భారీ బడ్జెట్ సినిమాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రికార్డు సృష్టించబోతోందని వార్తలు వినిపిస్తోంది. దాని ఖర్చు మాత్రమే కాదు. రాబడి కూడా రికార్డు స్థాయిలోనే వుందని తెలుస్తోంది.
సింగిల్ లాంగ్వేజ్ సినిమాల్లో నెట్ ఫ్లిక్స్ చాలా భారీ మొత్తానికి టోటల్ నాన్ థియేటర్ మొత్తాన్ని తీసుకుంది. ఆ మొత్తం మీద చాలా చాలా నెంబర్లు వినిపిస్తున్నాయి. సినిమాకు దాదాపు 225 కోట్లకు పైగానే ఖర్చవుతుందని తెలుస్తోంది.
సినిమాకు కేవలం అందరి రెమ్యూనిరేషన్లు కలిపి 125 కోట్ల మేరకు వుంటాయని తెలుస్తోంది. మరో వంద కోట్ల వరకు నిర్మాణ వ్యయం, వడ్డీలు, ప్రింట్ పబ్లిసిటీ వుంటుందని లెక్కలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే సింగిల్ లాంగ్వేజ్ సినిమాకు ఇంత భారీ వ్యయం ఇదే కావచ్చు. థియేటర్ మీద నుంచి 125 కోట్ల మేరకు ఆదాయం వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే అడియో మీద 20 కోట్ల వరకు ఆదాయం వస్తుందని వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ నుంచి ఎనభై కోట్లు వచ్చినా సినిమా లాభంలోకి వచ్చేసినట్లే.
సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. మరో ఎనభై రోజులు వర్క్ వుందని తెలుస్తోంది. సిటీ లోని వివిధ లొకేషన్లలో చిన్న చిన్న గ్యాప్ లతో సినిమాను షూట్ చేస్తున్నారు. అటు భారీ ఫైట్లు, ఇటు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్, త్రివిక్రమ్ మార్క్ చమక్కులు వెరసి గుంటూరు కారం సినిమాగా వుంటుంది. ఫ్యామిలీ టచ్ ఎలాగూ వుంటుంది అందుకోసమే ప్రకాష్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ ట్రాక్ నడుస్తుంది.