సలార్ విడుదల ఇక రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు ఇంకా సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు తేలడం లేదు. కీలకమైన నైజాం ఏరియాను ఎవరు పంపిణీ చేస్తారు అన్నది తేలలేదు.
గతంలో తమ సినిమాలు స్వంతగా పంపిణీ చేసుకున్న హంబోలే సంస్థ ఈసారి అలా చేయడం లేదు. వీలయితే అమ్మాలనే చూస్తోంది. నైజాంకు భారీ రేట్ కోట్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు నైజాం ఏరియాకు 65 నాన్ కోట్ రిటర్నబుల్ అడ్వాన్స్, 15 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ ను కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చాలా భారీ మొత్తమే. ఆదిపురుష్ సినిమా 35 కోట్ల రేంజ్ దగ్గర ఆగిపోయింది.
అయినా సలార్ జానర్ వేరు. ఆ లెక్కలు వేరు అని భావిస్తుండడం వల్లే దిల్ రాజు ఈ రేంజ్ అమౌంట్ ను కోట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా కాకపోతే 90 కోట్ల రేంజ్ లో రిటర్న్ బుల్ అడ్వాన్స్ తీసుకుని, జస్ట్ అయిదు లేదా ఆరుశాతం కమిషన్ మీద పంపిణీకి ఇచ్చే ఆలోచన కూడా హంబోలే సంస్థ చేస్తోందని తెలుస్తోంది.
కానీ అలా అయినా రిస్కే ఎందుకంటే కనీసం రెండు నెలల పాటు అయినా అన్ని కోట్లు వడ్డీ లేని అప్పు కింద బ్లాక్ అయిపోతాయి.
కానీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, హంబోలే ఫిల్మ్ ఇవన్నీ కలిసి సలార్ సినిమా మీద క్రేజ్ ను పెంచేస్తున్నాయి.