గుంటూరు కారం సినిమా మహేష్ వన్ మ్యాన్ షో కదా.. ఇదీ నిర్మాత నాగవంశీకి ఎదురైన పశ్న.
నిజానికి బయట జనాల్లో, సోషల్ మీడియలో వున్న అభిప్రాయం కూడా అదే. యావరేజ్ కంటెంట్ సినిమాను మహేష్ కనుక ఆ మాత్రం లాక్కు వెళ్లారు అన్నదే జనాల అభిప్రాయం కూడా. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం ఇది టూ మాన్ షో అంటున్నారు.
త్రివిక్రమ్ వెనుక వుండి మహేష్ చేత డ్యాన్స్ లు, ఫైట్లు, యాక్టింగ్ అంతా చేయించారు. ఎటొచ్చీ ఆయన తెరమీద కనిపించరు. అందువల్ల గుంటూరు కారం వన్ మ్యాన్ షో కాదు. టూ మ్యాన్ షో అంటున్నారు నాగవంశీ.
నాగవంశీ చెప్పింది కొంత వరకు నిజమే. ఏ హీరో అయినా సరే, ప్లానింగ్, చేయించేది దర్శకుడే. కానీ అలా అని అందరు హీరోలు సినిమాను పుల్ చేయలేరు. గుంటూరు కారం లాంటి యావరేజ్ కంటెంట్ సినిమాను మహేష్ లాంటి స్టార్ కనుక ఒక రేంజ్ వరకు లాగగలిగారు. మరో హీరో అయితే వేరుగా వుంటుంది.
ఎంత త్రివిక్రమ్ అయినా మహేష్ కనుకే అంతంత టికెేట్ రేట్లు పెట్టగలిగారు. మహేష్ కోసం జనాలు వెళ్లారు తప్ప త్రివిక్రమ్ కోసం కాదు కదా.