Advertisement

Advertisement


Home > Movies - Movie News

గురూజీని కలవండి..గిఫ్ట్ కొట్టండి

గురూజీని కలవండి..గిఫ్ట్ కొట్టండి

నిర్మాత బండ్ల గణేష్ కు దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి బాండింగ్ నే వుంది. తీన్ మార్ నుంచి అది కొనసాగుతూనే వుంది. కానీ ఈ రోజు వేసిన ఓ ట్వీట్ మాత్రం కాస్త సంచలనం సృష్టించేలా వుంది. 

ఈ మధ్యన త్రివిక్రమ్ తన సినిమాల మీద కన్నా, సినిమాలు సెట్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టారని, ఆ విధంగా చాలా సంపాదన వస్తోందని విమర్శలు వున్నాయి. పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని త్రివిక్రమ్ సంపాదించుకుంటున్నారనే విమర్శలు కూడా వున్నాయి. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగానే వున్నారు.

బ్రో సినిమా నిర్మాతల నుంచి త్రివిక్రమ్ భారీ రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఓజి నిర్మాత నుంచి కూడా రెమ్యూనిరేషన్, లాభాల్లో వాటా వుందని టాక్ వుంది. ఇప్పుడు బండ్ల వేసిన ట్వీట్ వీటికి అనుగుణంగా వుండడం విశేషం.

ఎవరో బండ్ల గణేష్ ను ట్విట్టర్లో నిర్మాత కావాలని వుంది అని అడిగారు దానికి బండ్ల ఇచ్చిన సమాధానం…’గురూజీని కలవడం..భారీ గిఫ్ట్ ఇవ్వండి..నెరవేరుతుంది’ అని. ఇండస్ట్రీలో గురూజీ అనగానే గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ దే కావడంతో ఈ ట్వీట్ కాస్త సంచలనంగా మారుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?