Advertisement

Advertisement


Home > Movies - Movie News

మాకు 'మళ్లీ పెళ్లి' రివ్యూ కావాలి.. మహేష్ పై ర్యాగింగ్

మాకు 'మళ్లీ పెళ్లి' రివ్యూ కావాలి.. మహేష్ పై ర్యాగింగ్

కొన్నిసార్లు మంచి చేసినా చెడు ఎదురౌతుంది. సోషల్ మీడియాలో ఈ పోకడ మరీ ఎక్కువ. ఇప్పుడు మహేష్ బాబు దీనికి బాధితుడిగా మారాడు. ఓ సినిమాపై ట్వీట్ వేస్తే, మరో సినిమా అతడ్ని చుట్టుకుంది. నెటిజన్లు మహేష్ బాబును ర్యాగింగ్ చేస్తున్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. మేమ్ ఫేమస్ అనే సినిమాపై మహేష్ బాబు ట్వీట్ వేశాడు. సినిమా చూశానని, చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఈ సినిమాను రాసి, డైరక్ట్ చేసి నటించిన సుమంత్ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అక్కడితో ఆగలేదు. సుమంత్ ప్రభాస్ తదుపరి చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై నిర్మించడం తనకు ఎంతో సంతోషం అంటూ మరో ట్వీట్ వేశాడు. ఓ సినిమాను ఇలా మెచ్చుకోవడంలో తప్పులేదు, కానీ అదే టైమ్ లో ఈ సినిమాతో పాటు మరో మూవీ వచ్చిన విషయాన్ని మహేష్ మరిచిపోయాడు. అదే మళ్లీ పెళ్లి మూవీ.

మహేష్ బాబు కుటుంబ సభ్యుడు, వరుసకు అన్నయ్య, సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన సినిమా 'మళ్లీ పెళ్లి'. మేమ్ ఫేమస్ తో పాటు ఈ సినిమా కూడా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పైగా ఇది కాస్త వివాదాస్పద చిత్రం అనే సంగతి అందరికీ తెలిసిందే. నరేష్ నిజజీవితంలో జరిగిన పెళ్లిళ్లు, యదార్థ ఘటనలు, పవిత్ర లోకేష్ తో సాగిస్తున్న లివ్-ఇన్ వ్యవహారాలతో ఈ సినిమా తెరకెక్కిందనే ప్రచారం సాగుతోంది.

ఇలాంటి టైమ్ లో మేమ్ ఫేమస్ కు మహేష్ ప్రచారం చేయడంతో, చాలామంది అతడ్ని 'మళ్లీ పెళ్లి'పై కూడా ట్వీట్ వేయమంటూ టీజ్ చేస్తున్నారు. మేమ్ ఫేమస్ సినిమా చూసినట్టే, మళ్లీ పెళ్లి సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని మహేష్ ను ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తున్నారు చాలామంది.

నిజానికి మళ్లీ పెళ్లి సినిమాలో మహేష్ బాబు ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి ఆ సినిమాను కూడా ప్రత్యేకంగా వీక్షించి, ట్వీట్ వేయాలంటూ కామెడీ చేస్తున్నారు చాలామంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?