హాయ్ నాన్న.. ఎమోషనల్ కంటెంట్

నాని-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో సివిఎమ్, విజయేంద్ర రెడ్డి నిర్మించిన సినిమా హాయ్ నాన్న. జెర్సీ సినిమాలో తండ్రీ కొడుకుల బాండింగ్, భార్యాభర్తల మధ్య సున్నితమైన సమస్యలు పెనవేసి చూపించిన హీరో నాని, ఈసారి…

నాని-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో సివిఎమ్, విజయేంద్ర రెడ్డి నిర్మించిన సినిమా హాయ్ నాన్న. జెర్సీ సినిమాలో తండ్రీ కొడుకుల బాండింగ్, భార్యాభర్తల మధ్య సున్నితమైన సమస్యలు పెనవేసి చూపించిన హీరో నాని, ఈసారి తండ్రీ కూతుళ్ల అనుబంధం, భార్యాభర్తల నడుమ మొదటికి వచ్చిన ప్రేమ ను చూపించబోతున్నారు. 

హాయ్ నాన్న ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ మొత్తం ఫీల్ గుడ్ ఎమోషనల్ కంటెంట్ పరుచుకుంది. సినిమా మొత్తం ఈ మీటర్ మీదే సాగినట్లు కనిపిస్తోంది.

ట్రయిలర్ లో రిలీఫ్ పెద్దగా లేదు. మొత్తం ఒకటే స్థాయి భావోద్వేగాలతో ట్రయిలర్ ను నడిపారు. ఇలాంటి సన్నివేశాల్లో నాని నటన ను కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. అది ఇప్పటికే చాలా సార్లు చూసార ప్రేక్షకులు. మృణాళ్ పాత్ర ఈ తరహాగా కాకుండా భిన్నంగా వుంది. ట్రయిలర్ లో కచ్చితంగా ఆకట్టుకునేది బేబీ కైరా నటన. ట్రయిలర్ ఎండ్ లో ఆ చిన్న పాప చూపించిన హావభావాలు, నటన కచ్చితంగా ఈ సినిమాను ఓ స్థాయికి చేరుస్తుందని అర్థం అయిపోతోంది.

హాయ్ నాన్న ట్రయిలర్ రిచ్ గా కలర్ ఫుల్ గా వుంది. నాని, మృణాల్, కైరాతో పాటు శృతిహాసన్ కూడా కనిపించారు ట్రయిలర్ లో. ఈ నాలుగు పాత్రల నడుమ సాగే మానవ సంబంధాల భావోద్వేగ ప్రయాణం అనుకోవాలి హాయ్ నాన్న సినిమాను.