క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. 12న విడుదలవుతున్న నేపధ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
హను-మాన్ పాత్ర కోసం తేజని ఎలా మౌల్డ్ చేశారు ?
-తేజ నాకంటే సీనియర్. తనకి యాక్టింగ్ నేర్పించాల్సిన అవసరం లేదు.(నవ్వుతూ) అయితే హనుమాన్ కోసం తేజని మేకోవర్ చేయించాను. జాంబీరెడ్డిలో సిటీ బాయ్ లా కనిపిస్తాడు. ఇందులో పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తాడు. మేకోవర్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కితిరిగి చూడలేదు. ఈ సినిమా కోసం తేజ చాలా కష్టపడ్డాడు. ఇది పూర్తయ్యే వరకూ మరో సినిమా ఒప్పుకోలేదు. హనుమాన్ పై నాకంటే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు తేజ.
బాగా ఆలస్యమైంది కదా నిర్మాణం?
-వీఎఫ్ఎక్స్ గురించి పూర్తిగా తెలుసనుకున్నాను. కానీ సినిమా మొదలుపెట్టిన తర్వాత అందులో సాధకబాధకాలు ఇంకా బాగా అర్ధమయ్యాయి. జాంబీ రెడ్డి 50 షాట్స్ వుంటాయి. ఇందులో 1600 షాట్స్ వున్నాయి. పైగా వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు అనుకున్న సమయానికి వర్క్ ని ఇవ్వలేకపోయారు. ఇంకా సమయం కావాలని కోరారు. ఈ జర్నీలో చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇకపై వీఎఫ్ఎక్స్ వున్న సినిమా ఫాస్ట్ గా తీయగలను.
సూపర్ హీరోల సినిమా కథలు దాదాపుగా ఒక టెంప్లెట్ లో వుంటాయి కదా?
-హనుమాన్ సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లెట్ లోనే వుంటుంది. కొత్తదనం ఏమిటంటే.. ఇది మన తెలుగు సినిమా స్టయిల్ అఫ్ మేకింగ్ లో వుంటుంది. బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాని రాజమౌళి చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. మరోలా చెప్పాలంటే కేజీఎఫ్ లో యష్ ని ఎలా చూపించారో నేను హనుమంతుని అలా చూపించబోతున్నాను.
ఒక సూపర్ హీరో పాత్ర కోసం తేజ సజ్జా లాంటి యంగ్ హీరోని తీసుకోవాలని ఎలా అనిపించింది?
-పర్శనల్ గా తేజని అందరూ ఇష్టపడతారు. సినిమాల్లో తనకి ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు. ఇందులో పాత్రకు ఇలాంటి నటుడే కావాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తనకి సూపర్ పవర్స్ రావాలని అనుకున్నప్పుడు ఆ పవర్స్ వస్తాయి. ఎమోషన్ ప్రేక్షకుల నుంచి రూట్ అవుతుంది కాబట్టి అది చాలా సహజంగా వుంటుంది.
నార్త్ లో ప్రమోషన్స్ చేశారు కదా రెస్పాన్స్ ఎలా వుంది ?
అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వుంది. సౌత్ సినిమాని చాలా గొప్ప స్థాయిలో చూస్తున్నారు. హనుమాన్ సినిమా తీస్తున్నామని చెప్పగానే.. సౌత్ వాళ్ళు గొప్పగా తీస్తారని అభినందించారు. చాలా ఆనందంగా అనిపించింది. హనుమాన్ కు అన్నీ వైపుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే… ఇదంతా ఒక డ్రీంలా వుంది. ప్రేక్షకులు చాలా గొప్ప ఆదరణ చూపుతున్నారు.
థియేటర్ల సమస్య గురించి?
-ఒక ఫిల్మ్ మేకర్ గా నా ద్రుష్టి కంటెంట్ మీదే వుండాలి. క్యాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామే లేదా అనేదే చూసుకోవాలి. కానీ అనుకోకుండా థియేటర్స్ చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి ఇది నిర్మాతలు చూడాల్సిన అంశం. కానీ కొన్నిసార్లు బాధకలిగించే మాటలు విన్నప్పుడు మాట్లాడాల్సి వస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత కేవలం కంటెంట్ గురించే మాట్లాడుతారు. హను-మాన్ చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా విజయం సాధిస్తే.. పదేళ్ళు పాటు మనం గర్వంగా చెప్పుకునే సినిమాలు చేయొచ్చునే ప్రణాళిక వుంది.