Advertisement

Advertisement


Home > Politics - National

కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్

కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్

గడిచిన రెండేళ్లలో వేలాది ఉద్యోగాల్ని తొలిగించాయి అమెజాన్, గూగుల్ సంస్థలు. మరీ ముఖ్యంగా 2023లో ఈ రెండు కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. ఆ చీకటి అధ్యాయాలు ముగిసిపోయాయని, కొత్త ఏడాదిలో అంతా మంచి జరుగుతుందని చాలామంది టెక్ నిపుణులు జోస్యం చెప్పారు కూడా.

కానీ గూగుల్, అమెజాన్ కంపెనీలు ఇంకా తమ సంస్థల్లో లే-ఆఫ్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈరోజు సెమాఫోర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గూగుల్ త్వరలోనే వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతోంది. 'గూగుల్ అసిస్టెంట్' విభాగంలో ఎక్కువ ఉద్యోగాలు ఊడబోతున్నాయి.

'గూగుల్ అసిస్టెంట్' కోసం ఏఐ ఆధారిత బార్డ్ ఛాట్ బాట్ ను వినియోగిస్తోంది. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గినట్టు నివేదిక స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో గూగుల్ లోని మరో కీలక విభాగంలో కూడా వందల సంఖ్యలో ఉద్యోగాలు ఊడతాయని చెబుతోంది సెమాఫొర్ నివేదిక

ఇక అమెజాన్ అయితే ఆల్రెడీ ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియ ప్రారంభించింది. ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టుడియోస్ విభాగాల్లో వందలాది ఉద్యోగులకు ఇప్పటికే సమాచారం అందించింది. కంపెనీ పనితీరు, ఉత్పత్తి ఆధారిత కారణాల వల్ల ఉద్యోగాల్ని తొలిగిస్తున్నట్టు ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది అమెజాన్.

అమెజాన్ కు చెందిన ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ విభాగం నుంచి 500 మంది ఉద్యోగులు, ఈ వారంలో కంపెనీని వీడబోతున్నారు. మార్కెట్లో అమెజాన్-గూగుల్ గట్టి వ్యాపార ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగాల తొలిగింపులో కూడా ఈ రెండు సంస్థలు పోటీపడడం బాధాకరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?