ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా కళ్లుచెదిరే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా రాకతో ఓవర్సీస్ లో టాప్-10 సినిమాల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సక్సెస్ అవుతుందనే అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, ఏకంగా రికార్డులు సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రభంజనానికి మహేష్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ సినిమాల రికార్డులు బద్దలయ్యాయి. ప్రస్తుతం యూఎస్ఏ ఆల్ టైమ్ టాలీవుడ్ హిట్స్ లో ఐదోస్థానానికి ఎగబాకింది హనుమాన్.
4 రోజుల కిందటే ఈ సినిమా టాప్-10 లిస్ట్ లో చేరింది. అప్పటికే సినిమా హవా పీక్స్ లో ఉండడంతో.. ఆదిపురుష్ ($3.1 మిలియన్), సాహో ($3.2 మిలియన్), భరత్ అనే నేను ($3.4 మిలియన్) సినిమాల రికార్డులు బద్దలవుతాయని అంతా ఊహించారు.
అయితే అంతకుమించి పెర్ఫార్మ్ చేసింది హనుమాన్ సినిమా. తాజాగా ఈ మూవీ 3.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్ తో ఏకంగా టాప్-5కు ఎగబాకింది. ఈ క్రమంలో అల వైకుంఠపురములో ($ 3.6 మిలియన్), రంగస్థలం ($ 3.5 మిలియన్) సినిమాల్ని కూడా ఇది క్రాస్ చేసింది. యూఎస్ మార్కెట్లో బాహుబలి-1 తర్వాత స్థానం హనుమాన్ దే.
అమెరికాలో ఆల్ టైమ్ టాప్-5 తెలుగు సినిమాలు..
1. బాహుబలి 2 – $ 20.5 మిలియన్
2. ఆర్ఆర్ఆర్ – $ 14.3 మిలియన్
3. సలార్ – $ 8.8 మిలియన్
4. బాహుబలి 1 – $ 8 మిలియన్
5. హనుమాన్ – $ 3.7 మిలియన్