సీరత్ కపూర్.. అప్పుడెప్పుడో 9 ఏళ్ల కిందటొచ్చిన రన్ రాజా రన్ సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆమె ఫిజిక్ లో కిలో మార్పు కూడా రాలేదు. అలా అని ఆమె ఫుల్లుగా డైటింగ్ చేస్తుందనుకుంటే పొరపాటు.
“డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవడం నాకిష్టం ఉండదు. స్వీట్స్, చాక్లెట్స్ తింటాను. కాకపోతే అన్నీ లిమిట్ గా తింటాను. నాకు ప్రత్యేకంగా న్యూట్రిషనిస్ట్ కూడా ఎవ్వరూ లేరు. ఇంట్లో వండిన ఆహారమే తింటాను. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాను. మనం ఎంత తినాలనేది బాడీ మనకు చెబుతుంది. అది ఫాలో అయితే చాలు. ఏదైనా తినొచ్చు. నేను రెగ్యులర్ గా బట్టర్ చికెన్, దాల్ మఖ్నీ, చికెన్ బిర్యానీ, చాక్లెట్ తింటాను. బయట ఫుడ్ విషయానికొస్తే ఇటాలియన్ రుచులంటే ఇష్టం.”
ఇలా తను ఎలాంటి డైట్ ఫాలో అవ్వననే విషయాన్ని బయటపెట్టింది సీరత్ కపూర్. అన్ని రుచులు ట్రై చేయాలని అనుకుంటానని, కాకపోతే లిమిట్ లో ఉంటానని చెబుతోంది. ఏ రోజైనా కాస్త అదనంగా తిన్నట్టు అనిపిస్తే, వెంటనే తన జిమ్ ట్రయినర్ కు చెబుతానని, మిగతా విషయాలన్నీ అతడే చూసుకుంటాడని చెబుతోంది.
“రోజూ పొద్దున్నే వేడి నీళ్లలో కాస్త నిమ్మకాయ రసం, తేనె వేసుకొని తాగుతాను. ఆ వెంటనే జిమ్ కు వెళ్తాను. ఇంట్లో వండిన టిఫిన్ చేస్తాను. షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాను. కుటుంబ సభ్యులతో డిన్నర్ చేసి పడుకుంటాను.”
ఇలా తన రొటీన్ లైఫ్ సింపుల్ గా సాగిపోతుందని చెబుతోంది సీరత్ కపూర్. ఎప్పుడైనా విహార యాత్రలకు వెళ్లాలనిపిస్తే, దేశాలు పట్టుకొని తిరగనని, హిమాలయాలకు మాత్రమే వెళ్తానని అంటోంది.