హరి హర- క్రిష్ రెండు భాగాల ప్లాన్?

టాలీవుడ్ మొత్తం అయ్యో అని సింపతీ చూపించే నిర్మాత-దర్శకుడు ఎవరు అని అంటే ఎఎమ్ రత్నం, క్రిష్ పేర్లు యునానిమస్ గా వినిపిస్తాయి. ఏనాడు ప్రారంభమైందో ఈ సినిమా. దీని తరువాత పవన్ కళ్యాణ్…

టాలీవుడ్ మొత్తం అయ్యో అని సింపతీ చూపించే నిర్మాత-దర్శకుడు ఎవరు అని అంటే ఎఎమ్ రత్నం, క్రిష్ పేర్లు యునానిమస్ గా వినిపిస్తాయి. ఏనాడు ప్రారంభమైందో ఈ సినిమా. దీని తరువాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు పూర్తి చేసి విడుదల చేసారు. 

వకీల్ సాబ్ అయిపోయింది. భీమ్లా నాయక్ అయిపోయింది. ఈ సినిమా అలా వుండగానే మరో మూడు సినిమాలు ఒప్పుకున్నారు. వాటిల్లో ఒకటి పూర్తయివస్తోంది. ఇంకో రెండు సెట్ మీద చకచకా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. కానీ హరి హర పరిస్థితి మాత్రం ఎక్కడ గొండడి అక్కడే అన్నట్లు వుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి బోలెడు మార్పులు చేసారని, పాటలు, భారీ ఫైట్లు చాలా వరకు ట్రిమ్ చేసారని వార్తలు వినిపించాయి. అవన్నీ చేసినా కూడా ఈ సినిమా చేసే విషయంలో ఎందుకో పవన్ కళ్యాణ్ అంత ఆసక్తి కనబర్చడం లేదు. అలా ఆసక్తి వుండి వుంటే ఈ సినిమా ఏనాటికో ఒక కొలిక్కి వచ్చి వుండేది. అలా జరగలేదంటే పవన్ కు అంత ఆసక్తి లేదేమో అన్న అనుమానాలు వుండనే వుంటాయి.

ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల తరువాతే హరి హర వీరమల్లు అన్నది పక్కా. అందులో సందేహం లేదు. అంటే మరో ఏడాది పైగా ఆగాల్సిందే. అంతవరకు ఆగితే దర్శక, నిర్మాతలు క్రిష్-రత్నం ల పరిస్థితి ఏమిటి? క్రిష్ పెద్ద సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది. నిర్మాత ఫండింగ్ కష్టాలు సరే సరి.

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఓ మధ్యే మార్గం ఆలోచిస్తున్నట్లు వినిపిస్తోంది. నిజంగా భలే ఐడియా అనుకోవాలి. ఇప్పటి వరకు తీసిన సినిమాకు మరో రెండువారాలు కనుక షూట్ చేస్తే ఓ కథ ఓ కొలిక్కి వస్తుంది. అప్పుడు దీన్ని ఫార్ట్ వన్ గా విడుదల చేసుకుంటే ఎలా వుంటుంది? అన్నది పాయింట్. ఇప్పుడు దీని మీదే డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా తొలిసగం అనే ఛేంజ్ చేయాలి. ఏ సీన్లు చేసి జొడిస్తే రెండు భాగాలు అన్నది పెర్ ఫెక్ట్ గా వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నట్లు వినిపిస్తోంది.

బహుశా పవన్ కళ్యాణ్ కనుక ఓకె అంటే ఈ దిశగా ముందుకు వెళ్లే అవకాశం వుంది. అదే కనుక జరిగితే నిర్మాత బయటపడిపోతారు. రెండో భాగం సంగతి తరువాత చూసుకుంటారు. క్రిష్ కూడా ఊపిరి పీల్చుకుంటారు.