21 యేళ్ల త‌ర్వాత‌.. 21 యేళ్ల యువ‌తి మిస్ యూనివ‌ర్స్!

చివ‌రిసారిగా ఇండియా త‌ర‌ఫున మిస్ యూనివ‌ర్స్ గా లారా ద‌త్తా నిలిచింది. ఆమె 2000 సంవ‌త్స‌రంలో ఆ కిరీటాన్ని పొందింది. స‌రిగ్గా 21 యేళ్ల త‌ర్వాత 2021లో మ‌రో భార‌తీయ యువ‌తి మిస్ యూనివ‌ర్స్ కీర్తి…

చివ‌రిసారిగా ఇండియా త‌ర‌ఫున మిస్ యూనివ‌ర్స్ గా లారా ద‌త్తా నిలిచింది. ఆమె 2000 సంవ‌త్స‌రంలో ఆ కిరీటాన్ని పొందింది. స‌రిగ్గా 21 యేళ్ల త‌ర్వాత 2021లో మ‌రో భార‌తీయ యువ‌తి మిస్ యూనివ‌ర్స్ కీర్తి కిరీటాన్ని పొంద‌డం గ‌మ‌నార్హం. 

లారా ద‌త్తా మిస్ యూనివ‌ర్స్ గా నిలిచిన సంవ‌త్స‌రంలో జ‌న్మించిన హ‌ర్నాజ్ సాంధూ ఇప్పుడు మిస్ యూనివ‌ర్స్ గా నిలిచింది. అంత‌ర్జాతీయ అందాల పోటీల్లో కిరీటాన్ని పొందిన మ‌రో భార‌తీయ యువ‌తిగా నిలుస్తోంది ఈ పంజాబీ భామ‌. 

ఇజ్రాయెల్ లో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె విజేత‌గా నిలిచింది. ఈ పోటీలో ఫ‌స్ట్, సెకెండ్ ర‌న్న‌ర‌ప్ లుగా ప‌రాగ్వే, సౌతాఫ్రికాకు చెందిన యువ‌తులు నిలిచారు. 

2020లో విశ్వ‌సుంద‌రి గా నిలిచిన మెక్సిక‌న్ భామ అండ్రియా మేజా, హ‌ర్నాజ్ కు కిరీటాన్ని తొడిగింది. 2017లో మానుషీ చిల్ల‌ర్ మిస్ వ‌ర‌ల్డ్ నిలిచింది. ఆ త‌ర్వాత ఇప్పుడు సాంధూ మిస్ యూనివ‌ర్స్ గా నిలిచి అంత‌ర్జాతీయ అందాల పోటీల్లో ఇండియా పేరును నిలిపింది