ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళనలు వ్యక్తం అవుతుండగా, ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దాఖలాలు ఉన్నా..కరోనా మహమ్మారి వ్యాపించడం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ కేసుల పరంపరలో .. లోయెస్ట్ లెవల్ కు చేరడం గమనార్హం.
డెయిలీ కేసుల విషయంలో ఇండియా ఇప్పటికే లోలెవల్లో ఉంది. 2020 జూన్ దగ్గర నుంచి ఇప్పటి వరకూ చూసుకున్నా.. రోజువారీ కేసుల విషయంలో ఇప్పుడు ఇండియాలో ప్రభావం బాగా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీక్లీ కేసుల లెక్కలో ఇండియాలో లోయెస్ట్ లెవల్ రికార్డు కావడం గమనార్హం. గత వారంలో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల లెక్క ప్రకారం.. గత 19 నెలలో లోలెవల్ లో కేసుల సంఖ్య నమోదైంది.
డిసెంబర్ ఆరు నుంచి పన్నెండో తేదీల మధ్యన దేశంలో మొత్తం యాభై ఆరు వేల కేసులు నమోదయ్యాయి. గత 19 నెలల వ్యవధిలో ఒక వారంలో ఇంత తక్కువ స్థాయి కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి అని గణాంకాలు చెబుతున్నాయి.
చివరి సారిగా గత ఏడాది మే నెల మధ్యలో.. ఒకే వారంలో అరవై వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏ వారంలో కూడా అంతకన్నా తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. గత వారంలో ఈ కనిష్ట స్థాయి నమోదైంది.
ఇది అత్యంత సానుకూలంశం అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే దేశంలో పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులైతే నమోదయ్యాయి. కానీ.. వాటిల్లో తీవ్ర ప్రభావాలు ఏమీ కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియెంట్ కు గురైన వారు హోం క్వారెంటైన్ లోనే కోలుకున్నట్టుగా కూడా వారికి చికిత్సనందించిన వైద్యులు చెబుతున్నారు. అయితే మీడియా మాత్రం మూడు కేసులు వచ్చాయి.. ఇక మూడో వేవే అంటూ జనాలను హడలెత్తిస్తోంది.