నిత్యం వార్తల్లో నలగడం అనసూయ స్పెషాలిటీ. ఆమె చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం వైఫైలా అలా తిరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెపై జరిగే ట్రోల్స్, వాటికి అనసూయ ఇచ్చే ఘాటైన సమాధానాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా అనసూయపై మరో చర్చ మొదలైంది. ఈసారి ఆమె ఫిజిక్ కు సంబంధించిన మేటర్ ఇది.
అవును.. ఈమధ్య కాలంలో అనసూయ కాస్త లావెక్కిందట. దీనిపైనే సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఏడాది కిందట ఆమె ఫొటోల్ని, తాజా ఫొటోల్ని పక్కపక్కనపెట్టి మరీ నెటిజన్లు, అనసూయ ఫిజిక్ పై డిస్కషన్ షురూ చేశారు.
ఈ చర్చ మొత్తానికి కేంద్ర బిందువు నిన్న ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్. ఈసారి చీరకట్టులో కనిపించింది అనసూయ. ఎప్పట్లానే ఓ పాటకు స్టెప్పులు కూడా వేసింది. సరిగ్గా అక్కడే వ్యవహారం తేడా కొట్టింది. ఆ చీరలో అనసూయ కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె లావెక్కిందంటూ చర్చ మొదలైంది.
అనసూయ లావెక్కడం కొత్తకాదు. గతంలో ఆమె ఓసారి (ప్రెగ్నెన్సీ టైమ్ లో) లావెక్కింది. ఆ తర్వాత స్లిమ్ అయింది. ఇప్పుడు మరోసారి బొద్దుగా మారినట్టు కనిపిస్తోంది. ఆమె నిజంగానే బరువు పెరిగిందా లేక చీరకట్టులో అలా ఉందా అనే విషయం త్వరలోనే మరో డ్రెస్ లో కనిపించినప్పుడు తేలిపోతుంది. లేదా ఈలోగా అనసూయ తన ఫిజిక్ పై రియాక్ట్ అయినా అవ్వొచ్చు.