వివాదాస్పద నటి, బిగ్‌బాస్ తమిళ ఫేమ్ వనిత విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. సీనియర్ నటులు మంజుల-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తే వనిత. కొన్ని రోజుల క్రితం ఆమె పీటర్ పాల్‌ను చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
వనితకు ఇది మూడో వివాహం. 2000వ సంవత్సరంలో నటుడు ఆకాశ్‌ను ఆమె మొదటి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు పట్టారు. మనస్పర్థలతో 2005లో ఆకాశ్, వనిత దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆనంద్‌తోనూ కుదరక పోవడంతో విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా మూడోసారి పీటర్ పాల్‌ను వనతి వివాహం చేసుకున్నారు.
వనిత మూడో పెళ్లి దుమారం రేపింది. నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్ తదితరులు వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. వీరికి వనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, వీరి గొడవ పోలీసుల కేసుల వరకు వెళ్లింది.
దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా అంటూ నోటీసుల వరకు వెళ్లారు. ఇదిలా ఉండగా శుభమా అని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకున్న వనితకు మూడో పెళ్లి కష్టాలు తెచ్చి పెడుతోంది. వనిత భర్త పీటర్ పాల్ గుండపోటుకు గురి కావడం ఆమె అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు ఆవేదన కలిగిస్తోంది. పీటర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.