Advertisement

Advertisement


Home > Movies - Movie News

అసలైన ప్రేమ కోసం వెయిటింగ్

అసలైన ప్రేమ కోసం వెయిటింగ్

దశాబ్ద కాలంలో ఎన్నో సార్లు ప్రేమలో పడ్డాడు నవదీప్. అలా ప్రేమలో పడిన ప్రతిసారి బ్రేకప్ అయింది. ఈసారి మాత్రం అసలైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందని, అలాంటి ప్రేమ కోసం ఎదురుచూస్తున్నానని ప్రకటించాడు.

"నేను ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాను, ఎన్ని బ్రేకప్స్ అయ్యాయో లెక్కపెట్టలేదు. 16 ఏళ్లకే ప్రేమలో పడ్డాను. అప్పట్నుంచి పడుతూనే ఉన్నాను, చాలాసార్లు మనసు విరిగిపోయింది. ప్రస్తుతం 38 ఏళ్లు. అసలైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాను. ప్రేమలో పడ్డానికి వెయిట్ చేస్తున్నాను. ఈసారి ప్రేమలో పడితే అదే ఫైనల్ అవుతుందని నా ఆశ."

ఇప్పటివరకు తన జీవితంలో చాలా తప్పులు జరిగాయని, వాటన్నింటి నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు, అసలైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నానని అంటున్నాడు నవదీప్. తన ప్రేమ సంగతులు ఇంట్లో వాళ్లకు తెలుసని కూడా చెబుతున్నాడు.

నవదీప్ తల్లి, అక్క అతడి ఫ్రెండ్స్ అందరితో చాలా క్లోజ్ గా ఉంటారట. ఇప్పటివరకు తను నటించిన హీరోయిన్లంతా తన ఇంటికి వచ్చారని, సరదాగా అమ్మ-అక్కతో కాలక్షేపం చేశారని అంటున్నాడు. అయితే ఇంట్లో చూసిన సంబంధం మాత్రం చేసుకోనని, అసలైన ప్రేమను పొందిన తర్వాత అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెబుతున్నాడు.

తనకు గతంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని అంగీకరించిన నవదీప్.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మహిళలు కూడా ఆ రిలేషన్ షిప్స్ ఉన్నారని, తన క్లోజ్ సర్కిల్ లో చాలామందికి తన రిలేషన్ షిప్స్ గురించి తెలుసని అన్నాడు. లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్రేట్ ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడిన నవదీప్.. డ్రగ్స్ కేసుపై స్పందించడానికి మాత్రం నిరాకరించాడు. తన మాటకారితనంతో ఆ టాపిక్ నుంచి తప్పించుకున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?