తమిళ హీరో విక్రమ్ కు తీవ్రగాయాలయ్యాయి. తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్ పక్కటెముకలు విరిగాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు.
విక్రమ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
కాగా విక్రమ్ విలక్షణ నటనకు పెట్టింది పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన కోలీవుడ్ లో పెద్ద హీరోలో ఒకరుగా గుర్తింపు పొందారు. విభిన్న చిత్రాలతో.. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్ చూపిస్తూ తనలోని నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ. అభిమానులను అలరిస్తుంటాడు. అపరిచితుడి సినిమాతో నటుడుగా మంచి పేరు ఫేమ్ వచ్చింది.