Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో? చూడాల్సిందే !

హీరో? చూడాల్సిందే !

కొత్త హీరో గల్లా అశోక్ నటించే సినిమా టీజర్, టైటిల్ వచ్చేసాయి. మూడేళ్ల క్రితం దేవ్ దాస్ సినిమా అందించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సినిమాకు హీరో అని టైటిల్ ఫిక్స్ చేసారు. తొలిసినిమాలో తనలో వున్న అని వేరియేషన్లు చూపించేయాలని కొత్త హీరోలు తహతహలాడడం సహజం.

అందులో సూపర్ స్టార్ మనవడు, మరో సూపర్ స్టార్ మేనల్లుడు, పెద్ద బిజినెస్ హవుస్ నుంచి, అంతకన్నా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో, టీజర్ లో ఇలాంటి వ్యవహారాలు చాలానే చొప్పించారు. కుర్రాడిని చూస్తుంటే కొన్నాళ్లు ఇండస్ట్రీలో వుండేలాగే కనిపిస్తున్నాడు.

కౌబాయ్ నుంచి జోకర్ వరకు అనేక గెటప్ లు చూపించేసారు. మధ్యలో రొమాంటిక్ యాంగిల్ కూడా జోడించారు. హీరో బిల్డప్ షాట్ లు చాలానే వున్నాయి. టోటల్ గా ఎక్కువ యాక్షన్ మీదే ఆధారపడినట్లు కనిపిస్తోంది. వారసత్వాలు, బ్యాకింగ్ లతో వచ్చే హీరోల తొలి సినిమా టీజర్లు ఇలాగే వుంటాయి. రాను రాను ప్రేక్షకులు చూడడానికి అలవాటు పడిపోతారు. 

గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. శ్రీరామ్ ఆదిత్యకు  ఈ తరహా సినిమా ఇదే తొలిసారి. ఇప్పటి వరకు తీసిన మూడు సినిమాలు డిఫరెంట్ గా ట్రయ్ చేసాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?