ఆంధ్ర రాజకీయాల్లో జగన్ నవరత్నాల హామీ ఎంతటి ప్రభావం చూపించిందో తెలిసిన సంగతే. తెలుగు సినీ నటీనటుల సంఘం మా ఎన్నికల కోసం కూడా ఇలాంటి నవరత్నాల హామీ రాబోతోందన బోగట్టా.
ఏ ప్యానల్ తో సంబంధం లేకుండా అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న నటి జీవిత ఈ నవరత్నాల హామీలను త్వరలో ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటి వరకు తానేం చేసాను, అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఏం చేస్తాను అనేది ప్రకటిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల లోపే మా సభ్యుల ఇన్స్యూరెన్స్ మొత్తంలో సభ్యులు కట్టాల్సిన వాటాను ఆమె చెల్లించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
చాలా మంది సభ్యులు తాము చెల్లించాల్సిన వాటా చెల్లించలేకపోతున్నారు. దాని వల్ల మెడికల్ ఇన్స్యూరెన్స్ రావడం లేదు. ఆ మొత్తం దాదాపు 15 లక్షల వరకు వుంటుందని అంచనా. ఈ మొత్తాన్ని కానీ, అవసరమైన వారి భాగాన్ని కానీ తానే చెల్లించే ఆలోచన జీవిత చేస్తున్నారట.
ఈ లెక్కన చూస్తుంటే విష్ణు, ప్రకాష్ రాజ్ లకు జీవిత గట్టి పోటీనే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రకాష్ రాజ్, విష్ణులకు ఎవరి మైనస్ పాయింట్లు వారికి వున్నాయి. వారు ఇద్దరే పోటీ చేస్తే వేరే చాయిస్ వుండదు. అదే జీవిత కూడా పోటీ చేస్తే మాంచి ఆల్టర్ నేటివ్ దొరికినట్లు అవుతుంది.