హీరోయిన్ కారు యాక్సిడెంట్.. ఒకరు మృతి

యషికా ఆనంద్.. తమిళనాట పాపులర్ నటి, హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడీ హీరోయిన్ కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది.…

యషికా ఆనంద్.. తమిళనాట పాపులర్ నటి, హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడీ హీరోయిన్ కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో యషికా ఆనంద్ స్నేహితురాలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవానీ అక్కడిక్కడే మృతి చెందింది.

మమళ్లాపురం నుంచి చెన్నై వస్తుండగా రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో కారులో యాషికా ఆనంద్, భవానీతో పాటు మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. వీళ్లలో ఒక వ్యక్తి కారును నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం యషికా ఆనంద్ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే యషికా తండ్రి ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు.

ఢిల్లీలో పుట్టిపెరిగిన యషికా, మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. కోలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో చెన్నైలో సెటిల్ అయింది. తమిళ బిగ్ బాస్ సీజన్-3లో కూడా పాల్గొని మంచి పేరు, క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఫొటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

మద్యం సేవించి అతివేగంతో కారు నడపడం వల్లనే, వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యషికా చేతిలో 5 తమిళ సినిమాలున్నాయి.