అవకాశాలు తగ్గితే కెరీర్ క్లోజ్ అయినట్టే. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోయిన్లకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చింది. అదే వెబ్ సిరీస్. అవును.. హీరోయిన్లంతా ఇప్పుడు ఈ దిశగా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గిన మరుక్షణం, వెబ్ సిరీస్ కు కాల్షీట్లు కేటాయిస్తున్నారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి సమంత కూడా చేరింది. సూపర్ హిట్టయిన ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ సీజన్-2లో సమంత నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సిరీస్ లో ఉగ్రవాదిగా కనిపించబోతోంది ఈ బ్యూటీ.
రీసెంట్ గా తమన్న కూడా ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వికటన్ గ్రూప్ ప్రొడ్యూస్ చేయబోతున్న ఓ ఫిమేల్ సెంట్రిల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు కాల్షీట్లు కేటాయించింది మిల్కీబ్యూటీ. ఇది హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.
ఈ లిస్ట్ లోకి ఇషా రెబ్బా కూడా చేరిపోయింది. తెలుగమ్మాయిని కాబట్టే తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయంటూ రీసెంట్ గా బాంబ్ పేల్చిన ఈ భామ, ఆ వెంటనే వెబ్ సిరీస్ కు షిఫ్ట్ అయింది. లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో నటిస్తోంది. సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ ఎపిసోడ్స్ లో కూసింత హాట్ గా కనిపించబోతోంది ఈ తెలుగమ్మాయి.
సమంత, తమన్నలానే హన్సిక కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పింది. త్వరలోనే తను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ప్రకటించింది ఈ ఆపిల్ పిల్ల. అయితే ఆ వెబ్ సిరీస్ డీటెయిల్స్ ఏంటనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. నెట్ ఫ్లిక్స్ కోసం ఆమె వర్క్ చేయబోతోంది. డీల్ కూడా భారీగానే కుదిరింది. సాక్షి చౌదరి, రష్మీ గౌతమ్, సంజన లాంటి తారలు కూడా వెబ్ సిరీస్ కు రెడీ అవుతున్నారు. వీళ్లలో సంజన, హాట్ గా ఉండే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
రాధిక ఆప్టే, మంజరి ఫడ్నిస్, ప్రియమణి, స్వరభాస్కర్, కైరా అద్వానీ, కల్కి కొచ్లిన్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్ లోకి ప్రవేశించారు. రాబోయే రోజుల్లో హీరోయిన్లంతా ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సిరీస్ కు కూడా కాల్షీట్లు కేటాయించే పరిస్థితి వస్తుందన్నమాట.