నాని సరసన ఐశ్వర్యరాజేష్

అలనాటి హీరో రాజేష్ కుమార్తే ఐశ్వర్య రాజేష్ మెల్లమెల్లగా తెలుగు జనాలకు బాగానే పరిచయం అవుతోంది. ఆ మధ్య వచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి, రాబోతున్న మిస్ మ్యాచ్ సినిమాలు ఆమెను ప్రేక్షకులకు దగ్గర…

అలనాటి హీరో రాజేష్ కుమార్తే ఐశ్వర్య రాజేష్ మెల్లమెల్లగా తెలుగు జనాలకు బాగానే పరిచయం అవుతోంది. ఆ మధ్య వచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి, రాబోతున్న మిస్ మ్యాచ్ సినిమాలు ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హీరో నాని సినిమాలో సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆమెను వెదుక్కుంటూ వస్తోంది.

నాని-శివనిర్వాణ కాంబినేషన్ లో తయారు కాబోయే సినిమాలో సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ వుంది. హీరో మరదలి పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ కోసం ఐశ్వర్య రాజేష్ పేరు పరిశీలిస్తున్నారు. ఇవ్వాళో, రేపో రెమ్యూనిరేషన్, డేట్ లు వంటి వ్యవహారాలు సెటిల్ అయితే పేరు ప్రకటించేస్తారు.

సాహు గారపాటి నిర్మించే ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. గోదావరి జిల్లాల్లో షూట్ చేయడమా? పోలాచ్చిలో చేయడమా అన్న చర్చలు సాగుతున్నాయి.

మన పల్లెల్లో జరిగే ఉత్సవాలు వంటివి కూడా సినిమాలో భాగంగా వుంటాయి. అందువల్ల గోదావరి జిల్లాల్లో చేయాలనే భావిస్తున్నారు.