తాత బర్త్ డే..మనవడి పార్టీ

మనవడి బర్త్ డే ఏ తాత అయినా సెలబ్రేట్ చేస్తాడు. తాత బర్త్ డే సెలబ్రేట్ చేసే మనవడు కీలకం. డైరక్టర్ మారుతి ఇప్పడు ఆ పనే చేసారు. ప్రతి రోజూ పండగే సినిమాలో…

మనవడి బర్త్ డే ఏ తాత అయినా సెలబ్రేట్ చేస్తాడు. తాత బర్త్ డే సెలబ్రేట్ చేసే మనవడు కీలకం. డైరక్టర్ మారుతి ఇప్పడు ఆ పనే చేసారు. ప్రతి రోజూ పండగే సినిమాలో తన హీరో చేత తాత బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయించేసారు. అంతే కాదు, బిగ్ బాస్ సెలబ్రిటీ రాహుల్ సిప్లిగంజ్ ను తీసుకువచ్చి మరీ పాడించేసారు.

సాయితేజ్-రాశీఖన్నా కాంబినేషన్ లో బన్నీవాస్-యువి వంశీ నిర్మిస్తున్న ప్రతిరోజూ పండగ సినిమాకు సంబంధించి మూడో పాటను విడుదలచేసారు. 'తకిట..తకిట' అంటూ సాగే ఈ బర్త్ డే సాంగ్ లో కాస్త మంచి మాటలు కూడా చొప్పించారు. థమన్ వున్నంతలో కాస్త క్యాచీ ట్యూన్ నే అందించారు.

కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట ను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా విడియో షూట్ చేసారు. ఆ ఫుటేజ్, సినిమా వర్కింగ్ ఫుటేజ్ కలిపి ఇంట్రస్టింగ్ గా కట్ చేసి లిరికల్ ప్రమోషనల్ విడియోగా వదిలారు.

డిసెంబర్ 20న విడుదలయ్యే ఈ సినిమాకు ఇప్పటికే మాంచి బజ్ వచ్చింది. యువి,గీతా కలిపి నిర్మించడం, మారుతి డైరక్టర్ కావడంతో ఆటోమెటిక్ గా బజ్ వచ్చేసింది. యూనిట్ పెద్దగా శ్రమపడాల్సిన పనిలేకపోయింది.