హీరోయిజం తగ్గించండి-పవన్

రెండు వారాల కిందటే రెడీ అయిపోయింది వకీల్ సాబ్ ట్రయిలర్. దిల్ రాజు సన్నిహిత వర్గాలు ఎప్పుడో ఈ ట్రయిలర్ ను చూసాయి. హీరో పవన్ కూడా చూసారు. ట్రయిలర్ విడుదల డేట్ కూడా…

రెండు వారాల కిందటే రెడీ అయిపోయింది వకీల్ సాబ్ ట్రయిలర్. దిల్ రాజు సన్నిహిత వర్గాలు ఎప్పుడో ఈ ట్రయిలర్ ను చూసాయి. హీరో పవన్ కూడా చూసారు. ట్రయిలర్ విడుదల డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే ఈ ట్రయిలర్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

విషయం ఏమిటంటే పింక్ లో ముగ్గురు అమ్మాయిల పాయింట్ మాత్రం తీసుకుని, సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ స్టయిల్ కమర్షియల్ మూవీగా  మార్చారు. అందుకోసం మూడు భారీ ఫైట్లు యాడ్ చేసారు. కోర్టు సీన్లలో పవన్ మార్కు డైలాగులు పెట్టారు.

అయితే ట్రయిలర్ చూసిన పవన్ అందులో ఫైట్ల సీన్లు తగ్గించమని చెప్పినట్లు బోగట్టా. అన్ని యాక్షన్ సీన్లు వద్దు, థియేటర్లో చూస్తారు కదా..ట్రయిలర్ లో హీరోయిజం, యాక్షన్ సీన్లు తగ్గించండి అని చెప్పినట్లు తెలుస్తోంది. ట్రయిలర్ ఆరంభం..ఎండింగ్ బాగున్నాయి. మధ్యలో కొంచెం మార్చమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీంతో ఆ మేరకు మార్పులు చేసారని, కోర్టు డైలాగులు యాడ్ చేసారని బోగట్టా. కోర్టులో..అమ్మాయిని వర్జిన్ నా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే…అబ్బాయిలనో, లాయర్ నో పవన్ తన స్టయిల్ లో..'నువ్వు వర్జిన్ నా' అని ఎదురు ప్రశ్నించే డైలాగు వుందట. అది యాడ్ చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.