పేలిపోతున్న హీరోల చెక్కుడు బిల్లులు

ఒకప్పుడు హీరోలు అరవై ఏళ్లు దాటిన వారైనా జ‌నాలు చూసారు. కానీ ఇప్పుడు కాస్త వయసు మీద పడితే చూడడం లేదు. లుక్స్ బాగుండపోతే పక్కన పెడుతున్నారు.  Advertisement ముదురు మొహాలు చూడడానికి ఇష్టపడడం…

ఒకప్పుడు హీరోలు అరవై ఏళ్లు దాటిన వారైనా జ‌నాలు చూసారు. కానీ ఇప్పుడు కాస్త వయసు మీద పడితే చూడడం లేదు. లుక్స్ బాగుండపోతే పక్కన పెడుతున్నారు. 

ముదురు మొహాలు చూడడానికి ఇష్టపడడం లేదు. దాంతో తమ గ్లామర్, ఫిజిక్ కాపాడుకునే మార్గాలను హీరోలు అన్వేషిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు జిమ్ లో కష్టపడే వారు. కానీ ఇప్పుడు వయసు మీద పడితే జిమ్ లో కష్టపడడం సాధ్యం కావడం లేదు. 

ఇలాంటి టైమ్ లో సిజి అన్నది అయాచిత వరంగా దొరకింది. ఎలా వున్నా సిజి లో చెక్కేసుకోవచ్చు అనే ధీమా రాను రాను హీరోల్లో పెరుగుతోంది.

ఫ్యాన్స్ కూడా తమ హీరో బయట భయంకరంగా, సినిమాల్లో అందంగా ఎలా వుంటున్నాడని పట్టించుకోవడం లేదు. సినిమాలో బాగున్నాడా లేదా అని చూసి ఈల వేసి జేజేలు కొట్టేస్తున్నారు. దాంతో దాదాపు చిన్న, పెద్ద ప్రతి హీరోకి సిజి చెక్కుడు అనివార్యం అయిపోతోంది. దీని వల్ల ఒక్కప్పుడు కోటి, రెండు కోట్లు వున్న సిజి చెక్కుడు బిల్లు ఇప్పుడు రెండు అంకెలు దాటిపోతోందట.

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన రెండు పెద్ద సినిమాల్లో హీరోల చెక్కుళ్లకు పది నుంచి పదమూడు కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది. హీరోయిన్ కు తగినట్లు హీరోల రంగు మార్చాలి. గవదలు పీకేయాలి. ఇంకా చాలా చాలా చేయాలి. అందువల్ల భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇప్పుడే ఇలా వుంటే మన హీరోలంతా ఫార్టీ ప్లస్, ఫిఫ్టీ ప్లస్ అయిపోతున్నారు. ఇక మీదట ఇంకెలా వుంటుందో. ఇంకెంత ఖర్చు వుంటుందో? ఈ చెక్కడు బడ్ఙెట్ తో ఓ మిడ్ రేంజ్ సినిమా తీసేయవచ్చు.