ఓడియమ్మా.. హేషమ్ ఇలా కూడా కొడతాడా?

మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అంటే మెలొడీలకు పెట్టింది పేరు. అతడికి టాలీవుడ్ లో అవకాశం వచ్చిందే ఆ మెలొడీలు చూసి. ఆ ఇమేజ్ ను అతడు కాపాడుకుంటూ వస్తున్నాడు కూడా. మరి ఇలాంటి సంగీత…

మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అంటే మెలొడీలకు పెట్టింది పేరు. అతడికి టాలీవుడ్ లో అవకాశం వచ్చిందే ఆ మెలొడీలు చూసి. ఆ ఇమేజ్ ను అతడు కాపాడుకుంటూ వస్తున్నాడు కూడా. మరి ఇలాంటి సంగీత దర్శకుడు కాస్త పక్కకెళ్లి, హుషారుగా ఓ పాట కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది.

తనలోని ఆ కొత్త యాంగిల్ ను కూడా చూపించాడు హేషమ్. హాయ్ నాన్న సినిమా కోసం హిపాప్ స్టయిల్ లో ఓ సాంగ్ కంపోజ్ చేశాడు హేషమ్. వినగానే ఆకట్టుకునేలా ఉంది ఈ ట్యూన్. ఈ పాటకు నాని, శృతిహాసన్ వేసిన హుక్ స్టెప్ ను కూడా లిరికల్ వీడియోలో విడుదల చేశారు. 

నిజానికి ఇలాంటిదే ఓ సాంగ్ ను ఖుషి సినిమా కోసం కూడా కంపోజ్ చేశాడు హేషమ్. అయితే ఆ పాటతో పోలిస్తే ఇది క్లిక్ అయ్యేలా ఉంది. మరీ ముఖ్యంగా 'తాగితే మరిచిపోగలను' అనే సూపర్ హిట్ ఏఎన్నార్ లైన్స్ ను రీమిక్స్ చేయడం ఈ సాంగ్ కు మరింత కిక్ తీసుకొచ్చింది.

గోవా బ్యాక్ డ్రాప్ లో నానీని మరో షేడ్ లో చూపిస్తోంది ఈ సాంగ్. హాయ్ నాన్న సినిమాలో నానికి మంచి లవ్ ట్రాక్, అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందనే విషయం తెలిసిందే. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సాంగ్ సెట్ చేసినట్టున్నారు.

బాస్కో కొరియోగ్రఫీ, శృతిహాసన్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లు, ఆహ్లాదకరమైన సెట్.. అన్నీ కలిసి ఈ సాంగ్ కు ఓ కొత్త లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చాయి. 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.