ఇంకా 2 రోజులు మాత్రమే.. ప్రభాస్ సంగతేంటి?

సలార్ పార్ట్-1 ట్రయిలర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమై చాలా రోజులైంది. ఇప్పుడీ కౌంట్ డౌన్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. మరో 2 రోజుల్లో సలార్ సీజ్ ఫైర్ ట్రయిలర్ రిలీజ్…

సలార్ పార్ట్-1 ట్రయిలర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమై చాలా రోజులైంది. ఇప్పుడీ కౌంట్ డౌన్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. మరో 2 రోజుల్లో సలార్ సీజ్ ఫైర్ ట్రయిలర్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు ట్రయిలర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. మరి ప్రభాస్ సంగతేంటి?

సలార్ ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడాలనే ఉత్సుకత వాళ్లలో బలంగా ఉంది. అందుకే ఓవైపు ట్రయిలర్ కోసం ఎదురుచూస్తూనే, మరోవైపు ప్రభాస్ రాక కోసం కూడా వాళ్లు వెయిట్ చేస్తున్నారు.

ట్రయిలర్ రిలీజ్ అయితే కన్ ఫర్మ్ అయింది కానీ, ప్రస్తుతానికి ప్రభాస్ రాక మాత్రం ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ప్రభాస్ వస్తే ఈవెంట్ ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ లో చెప్పిన టైమ్ కు ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం, ట్రయిలర్ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదంట. ప్రభాస్ మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీంతో యూట్యూబ్ లోనే ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పరోక్షంగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాకు, కేజీఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో భాగంగా సలార్ రావడం లేదని, నిజానికి కేజీఎఫ్ సెట్స్ పైకి రావడానికి ముందే సలార్ స్టోరీ రాసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇద్దరు స్నేహితులు బద్దశత్రువులుగా మారిన కథతో సలార్ సినిమా వస్తోందని ప్రకటించారు.