భీష్మ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి.
ఇన్నాళ్లకు ఆ పుకార్లపై స్పందించారు హీరో నితిన్. ఆ వార్తలన్నీ నిజమేనని నిర్థారించారు. తన కొత్త సినిమాలో రష్మిక లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. మరి కొత్త హీరోయిన్ ఎవరు?
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందని అభిప్రాయపడిన నితిన్, చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ పరోక్షంగా రష్మికపై కామెంట్ చేశారు. దీంతో దర్శకుడు వెంకీ కుడుముల, శ్రీలీల అయితే బాగుంటుందని సూచించడంతో.. ఆమెను తీసుకున్నట్టు వెల్లడించాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో నటించారు. త్వరలోనే వెంకీ కుడుముల సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నమాట.
ఇక రష్మిక విషయానికొస్తే, పుష్ప-2తో పాటు ఆమె రెయిన్ బో అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చేయబోతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.