Advertisement

Advertisement


Home > Movies - Movie News

హాయ్ నాన్న ఇలా.. సైంధవ్ అలా..!

హాయ్ నాన్న ఇలా.. సైంధవ్ అలా..!

సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా బుల్లితెరపై కూడా ఫ్లాప్ చిత్రంగానే మిగిలింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో ఈ సినిమాను ప్రసారం చేస్తే కేవలం 2.42 రేటింగ్ వచ్చింది.

మొదటి ప్రసారానికే ఇంత తక్కువ రేటింగ్ అంటే, రిపీట్స్ లో ఈ సినిమాకు మరింత తక్కువగా టీఆర్పీలు రావడం గ్యారెంటీ. ఇదే టైమ్ లో జీ తెలుగులో జవాన్ (షారూక్) సినిమాను తొలిసారి టెలికాస్ట్ చేస్తే, సైంధవ్ కంటే కాస్త ఎక్కువ రేటింగ్ రావడం విశేషం.

ఇక నాని నటించిన హాయ్ నాన్న సినిమా కూడా ఇదే టైమ్ లో ప్రసారమైంది. జెమినీ ఛానెల్ లో ఈ సినిమాను తొలిసారి ప్రసారం చేశారు. ఈ మూవీకి 4.22 రేటింగ్ వచ్చింది. నాని రీసెంట్ మూవీస్ తో పోల్చి చూసుకుంటే, ఇది కాస్త బెటర్ నంబరే.

ఓవరాల్ గా బుల్లితెరపై సైంధవ్, హాయ్ నాన్న, జవాన్ సినిమాల్ని ఒకేసారి టెలికాస్ట్ చేయగా.. నాని నటించిన హాయ్ నాన్న సినిమా పైచేయి సాధించింది. త్వరలోనే గుంటూరు కారం, హనుమాన్, సలార్ సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?