హాయ్ నాన్న.. షాకిచ్చిన హీరోయిన్

నాని కొత్త సినిమా ఫాస్ట్ గా రెడీ అవుతోంది. దీనికి ఈ రోజు పేరు పెట్టారు. హాయ్ నాన్న అనేది టైటిల్. ఇలాంటి టైటిల్ ఏదో పెడతారని అంతా ముందే ఊహించారు. ఎందుకంటే, చాలా…

నాని కొత్త సినిమా ఫాస్ట్ గా రెడీ అవుతోంది. దీనికి ఈ రోజు పేరు పెట్టారు. హాయ్ నాన్న అనేది టైటిల్. ఇలాంటి టైటిల్ ఏదో పెడతారని అంతా ముందే ఊహించారు. ఎందుకంటే, చాలా రోజుల కిందట ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసినప్పుడే తండ్రికూతురు అనుబంధాన్ని చూపుతూ, తండ్రిగా నానిని, కూతురుగా ఓ చిన్న పాపను చూపించారు. కాబట్టి హాయ్ నాన్న అనే టైటిల్ ఆశ్చర్యపరచలేదు, ఊహించిందే.

కాకపోతే, బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం వేరే ఉంది. టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో నాని మేకోవర్ బాగుంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అందంగా ఉంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ వచ్చి హీరోను 'హాయ్ నాన్న' అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఈ ఒక్కటి మాత్రం సర్ ప్రైజ్ ఎలిమెంట్.

గ్లింప్స్ చూస్తుంటే, డిఫరెంట్ స్టోరీలైన్ తో 'హాయ్ నాన్న' వస్తుందనే విషయం అర్థమౌతూనే ఉంది. ఈ వీడియోకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హార్ట్ టచింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో ఆ సాంగ్ పాడింది కూడా ఇతడే.

శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న థియేటర్లలోకి వస్తోంది 'హాయ్ నాన్న' సినిమా.