Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీల్ కు షాక్.. ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

వకీల్ కు షాక్.. ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టిక్కెట్లను అమ్మాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు వకీల్ సాబ్ సినిమా వసూళ్లపై గట్టి ప్రభావం చూపించనున్నాయి. ఆ సినిమాకు గణనీయంగా వసూళ్లు తగ్గబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం.. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోల పేరిట టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదంటూ.. సరిగ్గా వకీల్ సాబ్ విడుదలకు ముందు రోజు జీవో జారీచేసింది ఏపీ సర్కార్. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించారు.

సింగిల్ బెంచ్ తీర్పు డిస్ట్రిబ్యూటర్లకు అనుకూలంగా వచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వం హైకోర్టులో మరోసారి సవాల్ చేసింది. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్, ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ప్రకారమే అమ్మాలని హైకోర్టు తీర్పునిచ్చింది. సినిమా విడుదలైన తొలి 2 రోజులు మాత్రమే టికెట్ ధరల పెంపు అమల్లో ఉంటుందని, మూడో రోజు నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లలోనే టికెట్లు అమ్మాలని కోర్టు తీర్పునిచ్చింది. రేపట్నుంచి వకీల్ సాబ్ టికెట్లు సాధారణ ధరలకే ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?