మహేష్ తర్వాత ఎక్కువ పేమెంట్ నాకే

సౌత్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోయిన్ విజయశాంతి. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా ఆ హవా తగ్గలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అత్యధిక…

సౌత్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోయిన్ విజయశాంతి. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా ఆ హవా తగ్గలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అత్యధిక మొత్తం తీసుకున్నట్టు పరోక్షంగా వెల్లడించింది విజయశాంతి. యూనిట్ లో మహేష్ బాబు తర్వాత పెద్ద పేమెంట్ తనదే అని ప్రకటించింది.

“ఇప్పటివరకు 60 మంది హీరోలతో పనిచేశాను. కొన్ని సినిమాల్లో నేను కూడా హీరోనే కదా. 90ల్లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రెమ్యూనరేషన్ గొడవ ఎందుకు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, సినిమాలో హీరో తర్వాత ఎక్కువ పారితోషికం నాదే. ఇంతవరకు మాత్రమే చెప్పగలను.”

మొన్నటివరకు మహేష్ తర్వాత హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అనీల్ రావిపూడిదని అనుకున్నారంతా. కానీ మహేష్ తర్వాత విజయశాంతికే ఆ స్థాయిలో పారితోషికం ఇచ్చారనే విషయం ఇప్పుడు బయటపడింది. అటు రష్మికకు కూడా ఈ సినిమాతో పేమెంట్ పెరిగింది. ఆమెకు దాదాపు కోటి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది